నెల్లిపాక బంజర పోస్ట్ ఆఫీస్‌లో గోల్‌మాల్..బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ చేతివాటం

by Aamani |
నెల్లిపాక బంజర పోస్ట్ ఆఫీస్‌లో గోల్‌మాల్..బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ చేతివాటం
X

దిశ,అశ్వాపురం : అశ్వాపురం మండలంలోని నెల్లిపాక బంజర పోస్ట్ ఆఫీస్ లో భారీ అవినీతి జరిగిందని ఖాతాదారుల ద్వారా వచ్చిన సమాచారం.వారిలో నగదు దాచుకున్న ఖాతాదారుడు వారి అవసరాల నిమిత్తం నగదు డ్రా చేయాలని బీపీఎంకు తెలపగా ఆ బీపీఎం నగదు డ్రా చేయడానికి వాయిదాలు చెప్పడంతో ఖాతాదారుడు అనుమానం వచ్చి హెడ్ పోస్ట్ ఆఫీస్ అయినా సారపాక ప్రధాన కార్యాలయం దగ్గరకు వెళ్ళగా ఆ ఖాతాదారుల అకౌంట్ లో నగదు జమ కాలేదని ఆందోళన చెందడంతో ఆ గ్రామంలోని ఒకరు ఒకరిగా అనుమానం వచ్చి వారి ఖాతాల్లో కూడా తనిఖీ చేసుకోగా నగదు జమ కాలేదని తెలిసింది. ఖాతాదారులు ఇచ్చిన సమాచారం మేరకు నెల్లిపాక బంజర లోని పోస్ట్ ఆఫీస్ లో బీపీఎం గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు ఖాతాదారుల వారి అవసరం నిమిత్తం వారి అకౌంట్ లో దాచుకోవడానికి, ఫిక్స్ డిపాజిట్లు చేయడానికి నగదును తీసుకొని పోస్ట్ ఆఫీస్ కు వెళ్లగా అక్కడ పోస్ట్ మాస్టర్ నగదును తీసుకొని ఖాతాలో జమ చేసినట్టుగా నగదు రాసి స్టాంప్ వేసి ఇవ్వటం జరుగుతుందని అన్నారు.

ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న బ్రాంచ్ మాస్టర్ ప్రతిరోజు ఖాతాదారుల నుంచి వచ్చిన సొమ్మును తీసుకొని వారి హెడ్ ఆఫీస్ అయిన సారపాక పోస్ట్ ఆఫీస్ నందు నగదును జమ చేయాలి. కానీ ఆ పోస్ట్ మాస్టర్ ఆ నగదును ఖాతాదారుల అకౌంట్లో జమ చేయకుండా తన చేతివాటం చూపి ఖాతాదారుల సొమ్మును విలాసవంతంగా వాడుకున్నాడని, ఆ బ్రాంచ్ మాస్టర్ రూ. 30 లక్షల నుంచి 50 లక్షల వరకు తన సొంత ఖర్చులకు వాడుకొని ఉంటాడని ఇంతవరకు ఖాతాదారుల అకౌంట్ లో నగదు జమ కాలేదు అని సమాచారం. ఖాతాదారుల ఆందోళనతో సారపాక హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి ఇన్స్పెక్టర్, మెయిన్ రివర్సర్,సదరు సిబ్బంది వచ్చి ఖాతాదారుల అకౌంట్లను తనిఖీ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed