Movies: ఓ వైపు సినిమాలు బ్రేక్ ఈవెన్ కాలేదు.. ఇంకో వైపు సక్సెస్ మీట్లు పెడుతున్నారు.. వీటిలో ఏది నమ్మాలంటూ ఫైర్ అవుతున్న సినీ లవర్స్

by Prasanna |
Movies: ఓ వైపు సినిమాలు బ్రేక్ ఈవెన్ కాలేదు.. ఇంకో వైపు సక్సెస్ మీట్లు పెడుతున్నారు..  వీటిలో ఏది నమ్మాలంటూ ఫైర్ అవుతున్న సినీ లవర్స్
X

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా పెద్ద హీరోల నుంచి ఒక సినిమా రావాలంటే రెండు, మూడేళ్లు పడుతుంది. అదే చిన్న హీరోలైతే 6 నెలలకు, ఏడాదికి రెండు సినిమాలు పక్కా వస్తున్నాయి. కొందరు సినిమా హిట్ అయిందా .. ఫ్లాప్ అని చూసుకోకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో ఓ కొత్త ట్రెండ్ నడుస్తుంది. ఇది సినీ లవర్స్ కు అసలు నచ్చడం లేదు. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..

కొత్త సినిమా థియేటర్లోకి వచ్చిన తర్వాత, టాక్ బాగుంటే వారం లోపే బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది. అదే మిక్స్డ్ టాక్ తో రన్ అయితే లేట్ గా అయిన బ్రేక్ ఈవెన్ కి టచ్ అవుతుంది. అయితే, కొందరు మాత్రం సినిమా బాగాలేకపోయిన బావుందని పోస్టర్ కు పెడుతుంటారు. ఇంకొందరు అయితే కలెక్షన్స్ పెట్టి ఆడియెన్స్ ను సినిమా థియేటర్లకు వచ్చేలా చేస్తారు.

దీనిపై రియాక్ట్ అయిన సినీ లవర్స్ షాకింగ్ వ్యాఖ్యలు చేసారు. ఓ వైపు సినిమాలు బ్రేక్ ఈవెన్ కాలేదు.. ఇంకో వైపు సక్సెస్ మీట్లు కూడా పెడుతున్నారు.. మేము వీటిలో ఏది అర్ధం చేసుకోవాలంటూ మేకర్స్ పై ఫైర్ అవుతున్నారు.

Advertisement

Next Story