ప్రజల సౌకర్యార్థం జాతీయ రహదారులు

by Sridhar Babu |
ప్రజల సౌకర్యార్థం జాతీయ రహదారులు
X

దిశ, ఖమ్మం : ఖమ్మం ప్రజల సౌకర్యార్థం జాతీయ రహదారుల నిర్మాణం ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఖమ్మం నగరంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఉన్న జాతీయ రహదారులను ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లినప్పుడల్లా కేంద్ర మంత్రుల వద్ద లిస్ట్ పెట్టి సుమారు రూ.645 కోట్ల తో ఈ సంవత్సరం 6 రోడ్లు మంజూరు చేసినట్టు తెలిపారు. ఈ రెండు మూడు నెలల్లో డీపీఆర్ తయారు చేయాలని, తర్వాత టెక్నికల్ షాంక్షన్ తీసుకొని టెండర్లను పిలవాలని అధికారులకు ఆదేశించినట్టు తెలిపారు. ఆ రోజుల్లో విజయవాడ- జగదల్పూర్ జాతీయ రహదారి మంజూరు చేసినప్పుడు రుద్రపూర్ నుంచి పాల్వంచ ఊరు బయటికి తీసుకువెళ్లాలని ఆలోచనతో ఉందని, కొత్తగూడెం ప్రజల కోరిక మేరకు ఊర్లో నుంచి తీసుకెళ్లాల్సిన

అవసరం ఏర్పడిందన్నారు. బైపాస్ రోడ్డు అను శెట్టిపల్లి నుంచి కొత్తగూడెం మీదుగా పాల్వంచ రోడ్డుకు కలుస్తుందన్నారు. అది మొత్తం 25 కిలోమీటర్లు ఉంటుందని చెప్పారు. ఈ రోడ్డు రూ. 450 కోట్లతో ప్రతిపాదించినట్టు తెలిపారు. ఈ సంవత్సరం యాక్షన్ ప్లాన్ తయారు చేసి, వెంటనే అధికారులు రెండు మూడు నెలల్లో డీపీఆర్ తయారుచేసి కేంద్రానికి పంపించనున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం టెక్నికల్ శాంక్షన్ ఇస్తే వెంటనే టెండర్లు పిలిచి పనులు మెదలు పెడతామని అన్నారు. మరో జాతీయ రహదారికి శాంక్షన్ వచ్చింది కాబట్టి రూ. 125 కోట్లతో 7 కిలోమీటర్ల తో ఖమ్మం చూట్టూ రింగ్ రోడ్డు వస్తుందన్నారు. ఖమ్మం చూట్టూ వచ్చే రింగ్ రోడ్డు నేషనల్ హైవే అథారిటీ కాబట్టి ఎక్కడబడితే అక్కడ రోడ్లు ఎక్కడానికి ఉండదని, నేషనల్ హైవే ఎగ్జిట్ ఇచ్చిన వాటి నుంచి రోడ్ ఎక్కాలన్నారు. కాబట్టి ఖమ్మం నగరం చుట్టూ ఉన్న రహదారికి సర్వీస్ రోడ్ కావాలని కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు.

మరొకటి భద్రాచలం టౌన్ లో ఉన్న కొత్త బ్రిడ్జి నుంచి ఊరు చివరి వరకు 7 కిలోమీటర్ల వరకు 6 లైన్ రహదారి విస్తరణ కోసం రూ. 50 కోట్ల తో మంజూరు చేసినట్టు తెలిపారు. జాతీయ రహదారిలో ఉన్న నూతన కలెక్టరేట్ వద్ద ఫుట్ పాత్ బ్రిడ్జి రూ.2.46 కోట్లతో, పాల్వంచ దగ్గర బ్రిడ్జి రెండో బ్రిడ్జి నిర్మాణం కోసం 20.22 కోట్లతో అదేవిధంగా కోదాడ జంక్షన్ నుంచి వరంగల్ క్రాస్ రోడ్డు వరకు రూ. 7 కోట్ల కు ప్రతిపాదన తయారు చేసినట్టు తెలిపారు. అలాగే భద్రాచలం నుంచి ఏటూరు నాగారం వరకు గతంలో శాంక్షన్ ఇచ్చారు కానీ నెంబర్ ఇవ్వలేదన్నారు. గోదావరి వెంట బొగ్గు గనుల ఉన్నాయి కాబట్టి నేషనల్ హైవే అడిగాం అన్నారు. అది 93 కోట్ల తో జగ్గయ్యపేట, తల్లాడ, వైరా, కొత్తగూడెం రోడ్డు నాలుగు లైన్ల విస్తరణ

పెండింగ్ లో ఉందన్నారు. ఇది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. అది కూడా కేంద్రానికి నివేదిక ఇచ్చామన్నారు. భద్రాచలం టు రాజమండ్రి జాతీయ రహదారి గతంలో ఇచ్చారని, పోలవరం ముంపు ప్రాంతం కావడంతో అది పెండింగ్లో ఉందన్నారు. దాన్ని దమ్మపేట నుంచి అశ్వరావుపేట కి ఏర్పాటు చేయాలని కోరినట్టు తెలిపారు. కొత్తగా నాయుడుపేట నుంచి రాపర్తి నగర్ వరకు రెండు బ్రిడ్జిలు అడుగుతున్నామన్నారు. శ్రీ శ్రీ విగ్రహం దగ్గర ఒక బ్రిడ్జి, ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఒక బ్రిడ్జి నిర్మాణం జరిగితే సిగ్నల్ ఫ్రీ ఉంటుంది కాబట్టి ఎవరికి ఇబ్బందులు ఉండదన్నారు. దీనికి రూ 80 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసినట్టు పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఖమ్మం నగర కార్పొరేషన్ మేయర్ నీరజ, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Next Story

Most Viewed