పాక్ జైళ్లలో 254 మంది భారతీయులు: విదేశాంగ శాఖ వెల్లడి

by vinod kumar |
పాక్ జైళ్లలో 254 మంది భారతీయులు: విదేశాంగ శాఖ వెల్లడి
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌-పాకిస్థాన్‌లు పరస్పరం కస్టడీలో ఉన్న పౌర ఖైదీలు, మత్స్యకారుల జాబితాలను పరస్పరం మార్చుకున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. 254 మంది భారతీయులు పాకిస్థాన్‌లో ఉండగా, 452 మంది పాకిస్థానీలు భారతీయ జైళ్లలో ఉన్నారు. పాక్‌ తమ కస్టడీలో ఉన్న 43 మంది ఖైదీలు, 211 మంది మత్స్యకారుల పేర్లను రిలీజ్ చేయగా..భారత్ తమ కస్టడీలో ఉన్న 366 మంది ఖైదీలు, 86 మంది మత్స్యకారుల పేర్లను వెల్లడించింది. నిరంతర ప్రయత్నాల ఫలితంగా 2014 నుంచి 2,639 మంది భారతీయ మత్స్యకారులు, 71 మంది ఖైదీలు పాక్ నుంచి భారత్‌కు పంపబడ్డారని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. పౌర ఖైదీలు, మత్స్యకారులతో పాటు వారి పడవలు, తప్పిపోయిన భారత రక్షణ సిబ్బందిని పాక్ చెర నుంచి త్వరగా విడుదల చేసి స్వదేశానికి రప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు వెల్లడించింది. కాగా, కాన్సులర్ యాక్సెస్ 2008పై ద్వైపాక్షిక ఒప్పందంలోని నిబంధనల ప్రకారం..ప్రతి సంవత్సరం జనవరి 1, జూలై 1 తేదీల్లో ఖైదీల వివరాలు పరస్పరం ఇరు దేశాలు వెల్లడిస్తాయి.

Next Story

Most Viewed