తాండూరు తహసీల్దార్ కార్యాలయంలో చోరీకి యత్నం..

by Aamani |
తాండూరు తహసీల్దార్ కార్యాలయంలో చోరీకి యత్నం..
X

దిశ,తాండూరు : తాండూరు తహసీల్దార్ కార్యాలయంలో చోరీకి యత్నిస్తున్న వ్యక్తిని రెవెన్యూ సిబ్బంది పట్టుకుని పట్టణ పోలీసులకు అప్పగించారు. పట్టణ సీఐ సంతోష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం తాండూరు పట్టణం మాణిక్ నగర్ కు చెందిన రవి అనే వ్యక్తి తహసీల్దార్ కార్యాలయం పై అంతస్తులో గల సర్వేయర్ రూమ్ వద్ద ఉన్న అల్మారా, కుర్చీలను దొంగిలించేందుకు ప్రయత్నించాడు. ఆ విషయాన్ని గమనించిన కాలనీ వాసులు తహసీల్దార్ కార్యాలయం సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. అక్కడికి చేరుకున్న రెవెన్యూ సిబ్బంది చోరీకి పాల్పడిన వ్యక్తిని పట్టుకుని పట్టణ పోలీస్ లకు అప్పగించారాని సీఐ సంతోష్ కుమార్ వెల్లడించారు. తహసీల్దార్ తారా సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Next Story

Most Viewed