నీళ్లు అనుకుని దోమల మందు తాగిన మున్సిపల్ కార్మికురాలు

by Nagam Mallesh |
నీళ్లు అనుకుని దోమల మందు తాగిన మున్సిపల్ కార్మికురాలు
X



దిశ, కొత్తగూడెం : మంచినీళ్లు అనుకొని దోమల మందుని తాగింది మున్సిపల్ కార్మికురాలు. ఈ సంఘటన శుక్రవారం కొత్తగూడెం మున్సిపాలిటీలో జరిగింది. కొత్తగూడెం మున్సిపాలిటీలోని ఎనిమిదో వార్డులో దోమల మందు ఫాగింగ్ చేస్తున్న మున్సిపల్ కాంట్రాక్టు కార్మికురాలు బత్తుల ఓదమ్మ.. మంచినీళ్లు అనుకొని పొరపాటున దోమల మందు తాగింది. దాంతో అస్వస్థకు గురి కావడంతో స్థానికులు ఆమెను కొత్తగూడెం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. మున్సిపల్ కమిషనర్ శేషాంజనేయ స్వామి ఓదమ్మను పరామర్శించారు. ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఓదమ్మకు చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed