- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ముదిగొండ పోలీస్ స్టేషన్ స్థాయి పెంచుతూ ఎస్‌హెచ్‌ఓగా సీఐ
దిశ,ముదిగొండ: ముదిగొండ మండల పోలీస్ స్టేషన్ స్థాయి అప్ గ్రేట్ చేస్తూ ఎస్ హెచ్ ఓ గా సర్కిల్ ఇన్స్పెక్టర్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముదిగొండ మండలంలో ఇప్పటి వరకు ఎస్ హెచ్ ఓ గా సబ్ ఇన్స్పెక్టర్లు మాత్రమే పనిచేసారు. ఇప్పటి వరకు సబ్ ఇన్స్పెక్టర్ గా గజ్జెల నరేష్ ముదిగొండ మండలంలో సంవత్సరనరకాలం గా విధులు నిర్వహించారు.ఇప్పటివరకు 300లకు పైగా క్రైమ్ రేట్ పెరిగింది అంటే ఇది ఒక రికార్డ్ గా ఉన్నది అధికారులు భావిస్తున్నారు.ఎస్సై నరేష్ సంవత్సరన్నర కాలంలో ఎలాంటి వ్యక్తిగత పోకడలో పోకుండా,మండల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ మండల ప్రజలకు తనదైన శైలిలో సేవలందించారు. ఎలాంటి ధర్నాలు లేకుండా,అసెంబ్లీ ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్ లను సైతం ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతత వాతావరణంలో ఎలక్షన్ నిర్వహించగలిగారు.
వ్యక్తిగతంగా ఎంతోమంది నిరుపేద విద్యార్థులకు పై చదువులకు ఆర్థిక సాయం అందించారు.మండలానికి ఇలాంటి ఎస్ఐ ఉంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని,ఎలాంటి భయం లేకుండా ప్రశాంతంగా జీవించవచ్చని మండల ప్రజలకు కొనియాడారు.అంతేకాకుండా రాబోయే రోజుల్లో ప్రభుత్వం గ్రామ స్థాయి ఎన్నికలు నిర్వహించబోతున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ గ్రామ స్థాయి ఎన్నికలకు కూడా మండలం గురించి తెలిసిన వ్యక్తి, రెండు ఎలక్షన్లలు సజావుగా సాగించిన సబ్ ఇన్స్పెక్టర్ నరేష్ ఎస్ హెచ్ ఓ కొనసాగిస్తే గ్రామస్థాయి ఎన్నికలు కూడా ప్రశాంతత వాతావరణం జరుగుతాయని మండల ప్రజలు కోరుకుంటున్నారు. మంగళవారం ముదిగొండ మండల నూతన సీఐ గా వడ్డేపల్లి మురళి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఖమ్మం స్పెషల్ బ్రాంచ్ సీఐగా విధులు నిర్వహించి ఇప్పుడు ముదిగొండ మండల ఎస్ హెచ్ ఓ గా బాధ్యతలు చేపట్టారు.