- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Manifesto : జార్ఖండ్ ఎన్నికల మేనిఫెస్టో పై కసరత్తు.. డిప్యూటీ సీఎం భట్టి, కేసీ వేణుగోపాల్ కీలక చర్చలు
దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ జార్ఖండ్ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్లలో ఒకరైన కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆ రాష్ట్ర పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. పలు ప్రచార కార్యక్రమాలు, పార్టీ కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి వ్యూహం.. విడుదల చేయాల్సిన మేనిఫెస్టో పై శుక్రవారం సాయంత్రం రాంచీలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఎన్నికల ఇంచార్జ్ భట్టి విక్రమార్క, జార్ఖండ్ పీసీసీ అధ్యక్షుడు కేశవ్ మహతో కమలేష్‌తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం అహమద్ మీర్ సాబ్, గౌరవ్ , బి కే హరిప్రసాద్, ఎలక్షన్ ఇన్చార్జి రామేశ్వర రావు తదితరులు మేనిఫెస్టోలో పొందుపర్చాల్సిన అంశాలపై కీలక చర్చలు జరిపారు.
ఇక మహారాష్ట్రలో నవంబర్ 20వ తేదీన సింగిల్ ఫేజ్‌లో ఎన్నికలు జరగనుండగా.. జార్ఖండ్‌కు మాత్రం రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 13, 20 తేదీల్లో ఆ రాష్ట్రానికి ఎన్నికలు జరగనున్నాయి. కాగా, ఇటీవల జరిగిన హర్యానా, జమ్ము కాశ్మీర్ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక, తెలంగాణ ఎన్నికల ఫలితాలు రిపీట్ అయ్యేలా కాంగ్రెస్ కూటమి వ్యూహాలు రచిస్తోంది.