- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాష్ట్ర ప్రభుత్వంపై ఎంపీ Soyam Bapu Rao ఫైర్
దిశ, జూలూరుపాడు: ఆదిలాబాద్ బీజేపీ పార్లమెంటు సభ్యులు సోయం బాబూరావును జూలురుపాడులో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్, మరియు బీజేపీ మండల అధ్యక్షుడు సిరిపురపు ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానంచారు. అనంతరం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీలకు పోడు పట్టాలు ఇవ్వకుండా గత 8 సంవత్సరాల నుంచి ఫారెస్ట్ అధికారులకు మరియు పోడు వ్యవసాయం చేసుకున్న రైతులకు మధ్య గొడవ సృష్టించింది రాష్ట్ర ప్రభుత్వమని, ఫారెస్ట్ అధికారులు సైతం పోడు వ్యవసాయం చేసుకునే రైతులకు పట్టాలు ఇవ్వండి తమకు ఎటువంటి సమస్యలు ఉండవు అని చెప్పినా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా పోవడం వల్లనే ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు హత్యగావించబడ్డాడని, ఆ హత్యను కచ్చితంగా ప్రభుత్వ హత్యగానే గుర్తించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పోడు చేసుకునే రైతులకు పట్టాలు ఇవ్వాలని, బీజేపీ ఎంపీ సోయం బాబూరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు మరియు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.