మౌలికవసతుల కల్పనే ధ్యేయం : ఎమ్మెల్యే ఉపేందర్​రెడ్డి

by Sridhar Babu |
మౌలికవసతుల కల్పనే  ధ్యేయం : ఎమ్మెల్యే ఉపేందర్​రెడ్డి
X

దిశ, ఖమ్మం రూరల్​ : పంచాయతీల్లో మౌలిక వసతులు కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు పాలేరు శాసనసభ సభ్యుడు కందాల ఉపేందర్​రెడ్డి అన్నారు. ఆదివారం రూరల్​ మండలంలో ‘మార్నింగ్​ పాలేరు’ కార్యక్రమంలో ఏదులాపురం, పెద్దతండా పంచాయతీ పరిధిలోని ఆధిత్యటౌన్​షిప్​, సూర్యనగర్​, కార్తీకేయ టౌన్​షిప్​, కేబీఆర్​ నగర్​, సాయినగర్​, కరుణగిరి కాలనీలలో ఎమ్మెల్యే కందాల స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పర్యటించారు. కాలనీల్లో గల పలు సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే కందాల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీలో, టౌన్​షిలలో కమిటీలు ఏర్పాటు చేసుకుని మౌలిక వసతుల కల్పనకు దోహదపడాలన్నారు.

సీఎం కేసీఆర్​ హామీతో వచ్చిన ఫండ్స్​తో అన్ని రహదారులను నిర్మిస్తామన్నారు. పంచాయతీ కార్యదర్శులు ప్రజల సమస్యల పరిష్కారినికి అందుబాటులో ఉండలని కోరారు. సీసీ కెమోరాలు ఏర్పాటు చేసుకోవడం వలన రక్షణగా ఉంటుందన్నారు. ప్రభుత్వాలే కాకుండా ప్రజల భగస్వామ్యంతో చేసే పనులు చాలా ఉన్నాయన్నారు. నాయుడుపేట నుంచి ఎం.వీపాలెం వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలుస్తారని అనంతరం పనులు ప్రారంభిస్తామన్నారు. డీటీసీపీ నిబంధనల ప్రకారం ఉన్న వెంచర్​లలో మాత్రమే ప్లాట్లు తీసుకోవాలన్నారు. వెంచర్​ నిర్వహకులే సైడ్​ డ్రైన్స్​, సీసీ రోడ్లు, తదితర మౌలిక వసతులు కల్పించాల్సి ఉందన్నారు. అ దిశగా అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. సాయినగర్​ ప్రధాన రహదారి, సూర్యనగర్​ ప్రధాన రహదారి నిర్మాణానికి నిధులు కేటాయిస్తానని తెలిపారు.

రాబోవు ఆరు నెలలో సీసీ రోడ్లు వేస్తామన్నారు. అదే విధంగా కాలనీల్లో గల విద్యత్​ లైన్లకు అంచనాలు తయారు చేసి పంచాయతీ నిదుల నుంచి ఏర్పాటు చేయాలని ఏదులాపురం పంచాయతీ సెపషల్​ అఫీసర్​, ఎంపీడీవో ఆశోక్​కుమార్ ను ఆదేశించారు. అనంతరం కాచిరాజీగూడెంలో జరుగుతున్న మల్లన్నస్వామి జాతరకు హాజరై ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్​రెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్​లు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రూరల్​ బీఆర్​ఎస్​ మండల అధ్యక్షుడు బెల్లం వేణు, జెడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్​, సుడా డైరెక్టర్​ గూడ సంజీవరెడ్డి, ​ఎంపీడీవో అశోక్​కుమార్​, పంచాయతీ కార్యదర్శులు రామక్రిష్ణ, క్రిష్ణ, బీఆర్​ఎస్​ నాయకులు ముత్యం క్రిష్ణారావు, జర్పుల లక్ష్మణ్​నాయక్​, నారపాటి రమేష్​, మైబేలి, కందాల యూత్​ కన్వీనర్​ మేకల ఉదయ్​, గరుడ రమేష్​, కరుణాకర్​రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed