- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Minister Ponguleti : అర్హులైన పేదలకు పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ..
దిశ, ఖమ్మం రూరల్: అర్హులైన పేదలకు పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం మంత్రి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ తో కలిసి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 59 వ డివిజన్ దానవాయిగూడెం లో పర్యటించి ఎస్డీఆర్ఎఫ్ నిధులు రూ. 25 లక్షలతో చేపట్టిన సీసీ కాల్వల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. గడిచిన 10 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం పేదవాడికి ఇళ్ల అంశం ఎన్నికల సమయంలో మాత్రమే ఊహాజనిత చిత్రాలు మీడియాలో చూపిస్తూ కాలం గడిపిందని, మార్పు కావాలని అది ఇందిరమ్మ రాజ్యం తోనే సాధ్యమని ప్రజలు ప్రజా ప్రభుత్వం ఎన్నుకొని 11 నెలలు కావస్తుందని అన్నారు. గతంలో కాంగ్రెస్ పరిపాలించిన సమయంలో ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణ పది జిల్లాల పరిధిలో 19 లక్షల 56 వేల ఇళ్లను వైఎస్ఆర్ చేతుల మీదుగా పేదలకు కట్టి ఇవ్వడం జరిగిందని, అదే విధంగా నేడు పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ప్రతి గ్రామంలో బహు పేదవారికి గ్రామసభల ద్వారా పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరిట మంజూరు చేస్తామని, 400 చదరపు అడుగులతో ఇల్లు నిర్మిస్తామని అన్నారు.
ప్రభుత్వ సహాయాన్ని నాలుగు దశలలో పునాది వేసినప్పుడు లక్ష రూపాయలు , లెంటల్ లెవెల్ లో లక్షా 25 వేల రూపాయలు, స్లాబ్ దగ్గర రూ. ఒక లక్షా 75 వేల, గృహప్రవేశం సమయానికి మరో లక్ష రూపాయలు లబ్ధిదారులకు నేరుగా అందించడం జరుగుతుందని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధుల విడుదల ఉంటుందని, నవంబర్ నెలాఖరు నాటికి అర్హుల జాబితా తయారు చేయడం జరుగుతుందని, రాబోయే నాలుగు సంవత్సరాలలో 20 లక్షల ఇళ్లకు తగ్గకుండా నిర్మించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. సాంకేతికతను వినియోగిస్తూ ప్రత్యేక యాప్ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పర్యవేక్షిస్తామని అన్నారు. నవంబర్ 20 తర్వాత గ్రామసభల ద్వారా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తుందని, అదే విధంగా గతంలో ప్రారంభించి పూర్తికాని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి కరెంటు, త్రాగునీరు, వంటి మౌళిక వసతులు కల్పించి లబ్ధిదారులకు కేటాయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీవో నర్సింహా రావు, మున్సిపల్ కార్పొరేషన్ ఇఇ కృష్ణ లాల్, డిఇ మాధవి దేవి, ఏఇ కుమారస్వామి, శానిటరీ సూపర్వైజర్ సాంబయ్య, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.