- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్..
దిశ, వైరా : జిల్లాలోని బీసీ సామాజిక వర్గం కుల వృత్తుల వారికి లక్ష రూపాయలు ఆర్థిక సహయం అందించే పథకాన్ని పారదర్శంగా అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ ఆదేశాలను వైరా తహసిల్దార్ కార్యాలయం అధికారులు బేఖాతర్ చేశారు. కులవృత్తిదారులకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను వెంటనే మంజూరు చేయటంతో పాటు లక్ష రూపాయల ఆర్థిక సహయం పథకం దరఖాస్తును ఆన్లైన్లో అక్కడికక్కడే చేసే విధంగా కలెక్టర్ రెవెన్యూ అధికారులకు ఇటీవల స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఆ మర్గదర్శకాల్లో భాగంగా సోమవారం ఖమ్మం జిల్లాలోని మండల కేంద్రాల్లో ఉన్న అన్ని తహసిల్దార్ కార్యాలయాల్లో మీసేవ కౌంటర్లను ఏర్పాటు చేసి కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయటంతో పాటు, లక్ష రూపాయల పథకం దరఖాస్తులను ఆన్లైన్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అయితే కలెక్టర్ ఆదేశాలను జిల్లాలోని పలు తహసీల్దార్ కార్యాలయాల అధికారులు అమలు చేశారు.
అయితే వైరా మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఉదయం రెవెన్యూ సిబ్బంది హడావుడిగా మీసేవ కౌంటర్లు ఏర్పాటు చేసేందుకు టెంట్ కూడా వేశారు. వైరా మండలంలో వైరాలో రెండు, సిరిపురంలో ఒకటి, రెబ్బవరంలో ఒకటి, తాటిపూడిలో ఒకటి మీసేవ కేంద్రాలు ఉన్నాయి. అయితే ఐదు మీసేవ కేంద్రాల ఆపరేటర్లు ఎవరు తహసిల్దార్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయలేదు. కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా తహసీల్దార్ కార్యాలయాల్లో సోమవారం మీసేవ కౌంటర్లు ఏర్పాటు చేసి కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయడంతో పాటు లక్ష రూపాయల పథకం దరఖాస్తులను ఆన్లైన్ చేస్తారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో మండలానికి చెందిన అనేకమంది కులవృత్తిదారులు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని మీసేవ కౌంటర్లు ఏర్పాటు చేస్తారేమో అని మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎదురు చూశారు.
మండలంలోని ఒక మీ సేవ కేంద్రానికి చెందిన ఆపరేటర్ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి మరల తిరిగి వెళ్లారు తప్ప ఇక్కడ ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయలేదు. టెంట్ ఏర్పాటుచేసిన రెవెన్యూ అధికారులు మీసేవ కేంద్రాల వారిని ఇక్కడకు తీసుకువచ్చి కౌంటర్లు ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. కలెక్టర్ ఆదేశాలే కదా.... ఆ ఆదేశాలు పట్టించుకోకపోయినా మాకేమవుతుంది అనుకున్నారో ఏమో కానీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. మండలానికి చెందిన సుమారు 300 మందికి పైగా రెవెన్యూ కార్యాలయానికి వచ్చి ఉసురుమని తిరిగి వెనక్కి వెళ్లారు. కలెక్టర్ ఆదేశాలనే అమలు చేయని రెవెన్యూ అధికారులు వారి ఉద్యోగ బాధ్యతలను ఏ విధంగా చేపడుతున్నారో ఈ ఘటనతో అర్థం చేసుకోవచ్చు.
రెవెన్యూ అధికారుల ఆదేశాలను మండలంలోని ఐదు మీసేవకేంద్ర ఆపరేటర్లు కనీసం పట్టించుకోలేదంటే రెవెన్యూ, మీసేవ ఆపరేటర్ల మధ్య చీకటి స్నేహాన్ని అర్థం చేసుకోవచ్చు. మీసేవ కౌంటర్లు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన మీసేవ కేంద్రాలపై కూడా రెవెన్యూ అధికారులు కనీస చర్యలు తీసుకోలేదంటే పరిస్థితి ఇక్కడ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి తన ఆదేశాలను బేఖాతర్ చేయడంతో పాటు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసి ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చిన స్థానిక తహసీల్దార్ కార్యాలయం అధికారులపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.