పోలీసులు ఎన్ని ఎత్తుగడలు వేసిన పోరాటాలు ఆగవు: మావోయిస్టుల లేఖ

by Mahesh |
పోలీసులు ఎన్ని ఎత్తుగడలు వేసిన పోరాటాలు ఆగవు: మావోయిస్టుల లేఖ
X

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: పోలీసుల కౌన్సిలింగ్ వ్యతిరేకించండి ఆదివాసి హక్కులకై పోడు భూమి పట్టాల‌కై పోరాడండి అంటూ సోమవారం నాడు మావోయిస్టు ఏరియా కార్యదర్శి అరుణ ఒక లేఖ విడుదల చేశారు. ఏప్రిల్ 6న భద్రాద్రి జిల్లా ఎస్పీ వినిత్‌తో పాటు చర్ల మండలంలోని పోలీసులు అధికారులు మావోయిస్టు పార్టీలో పని చేస్తున్న చర్ల మండలం కామ్రేడ్స్ యొక్క 16 కుటుంబాలను పిలిచి ఏర్పాటు చేసిన కౌన్సిలింగ్లో మీ పిల్లల్ని సరెండర్ చేయాలని ఇబ్బందికి గురి చేస్తున్నారు.సరెండర్ చేస్తే రివార్డులు,ఇల్లు,భూములు ఇస్తామని అనేక రకాల మాయ మాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారు.లొంగిపోయిన వారికి ప్రభుత్వం ద్వారా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని చెబుతూ ఇన్‌ఫార్మర్లుగా తయారుచేసి వారి చావులకు కారణమవుతున్నారని లేఖలో పేర్కొన్నారు.

చర్ల మండలంలోని ఎర్రంపాడు,బూరుగుపాడు, కన్నెవాయి, కిష్టారంపాడు, రాళ్లపురం, బట్టి గూడెం, చిన్నాపురం లాంటి ఆదివాసి గ్రామాలను ఇప్పటివరకు రెవెన్యూ గ్రామాలుగా గుర్తించకపోగా ఈ గ్రామాల నుండి చదువుకునే విద్యార్థులకు కులం ఆదాయ పత్రాలు ఇవ్వడం లేదని గత రెండు సంవత్సరాలుగా విద్యార్థులు, ఆదివాసీ ప్రజలు కలెక్టర్ కార్యాలయం చుట్టూ ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగిన ఏ అధికారి పట్టించుకోవడం లేదు.పోడు భూముల పట్టాల గురించి ఏ అధికారి పట్టించుకోక పోగా కష్టం చేసిన కడుపు మాడుతున్న ఆదివాసి ప్రజలను పక్కనపెట్టి వారిని తప్పుతో పట్టిస్తూ మావోయిస్టు పార్టీ నిర్మూలించి అడవి సంపదను దోచి సామ్రాజ్యవాదులకు, కార్పొరేటర్లకు అప్పగించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నాగాలు పన్నుతున్నాయి.

కుమ్మింగ్ పేరుతో గ్రామాలను జల్లెడ పడుతూ ప్రజలను సంతకాల పేరుతో పోలీస్ స్టేషన్లకు పిలిపించి వారిని భయపెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.వారి మాటలు వినని వారిని చిత్ర హింసలు పెట్టి జైల్లో బంధిస్తున్నారు.పోలీసులు చేస్తున్న కౌన్సిలింగ్ ఇవ్వాలా కొత్తేమి కాదు ప్రజలను పార్టీ కార్యకర్తలను తప్పు‌తో పట్టించే మాయాజాలం మాత్రమే. కౌన్సిలింగ్‌ల ద్వారా ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. శత్రువు ఎన్ని ఎత్తుగడలు వేసినా ఈ దోపిడీ వ్యవస్థ ఉన్నంతకాలం పోరాటాలు ఆగవని, వీరులు పుట్టుకొస్తూనే ఉంటారని, ప్రజా పోరు ప్రవాహంలో సామ్రాజ్యవాదులు దళారీ పాలకవర్గాలు భారీ మోచేతి నీళ్లు తాగే ఎస్పీ వినీత్ లాంటి అధికారులు ఎన్ని ప్లాన్లు వేసిన ప్రజల చేతిలో ఓడిపోవడం, అంతిమంగా కాలగర్భంలో కలిసిపోతారని, ఇలాంటి పోలీసుల కౌన్సిలింగ్ ప్రజల నుంచి పార్టీని దూరం చేయలేదని అరుణ విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Next Story