కృష్ణానది బ్రిడ్జి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

by S Gopi |
కృష్ణానది బ్రిడ్జి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
X

దిశ, నేరేడుచర్ల /మఠంపల్లి: అదుపుతప్పిన కారు ఆగి ఉన్న లారీని వేగంగా డీకొట్టడంతో ఒకరు మృతిచెందగా మరో ఇద్దరికీ తీవ్రగాయలైన సంఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని మట్టపల్లి బ్రిడ్జి సమీపంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు, మఠంపల్లి ఎస్సై రవి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన మర్రపూడి ప్రసాద్ కారులో కంచికచర్ల మండలం గొట్టిముక్కల గ్రామానికి చెందిన గోర్రెపాటి శ్రీనివాసరావు, అలాగే ఖమ్మం జిల్లా ముదికొండ మండలంలోని ఖానపురం గ్రామానికి చెందిన బెట్టె నాగేశ్వరరావులు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా గురజాల వెళ్ళి నందిగామ వైపు వెళ్ళున్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి శివారులోని కృష్ణానది బ్రిడ్జి సమీపంలో కారు అదుపు తప్పి ఆ పక్కనే ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో గోర్రెపాటి శ్రీనివాసరావు(50) అక్కడికక్కడే మృతిచెందాడు. మర్రపూడి ప్రసాద్, నాగేశ్వరరావుకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. మృతుని కుమారుడు గొర్రెపాటి జగదీష్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవి తెలిపారు.

Advertisement

Next Story