మధుప్రియ పాట...సండ్ర ఆట..

by Sridhar Babu |   ( Updated:2023-11-01 15:35:46.0  )
మధుప్రియ పాట...సండ్ర ఆట..
X

దిశ, సత్తుపల్లి : మధుప్రియ పాట...సండ్ర ఆటతో కల్లూరు ప్రజా ఆశీర్వాద సభ దద్దరిల్లింది. సీఎం ప్రసంగం కంటే ముందు తెలంగాణ ధూంధాం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి డాన్స్ స్టెప్పులు వేసి కార్యకర్తలను ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా అభినవ అంబేద్కర్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీర అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కల్లూరు మండల కేంద్రంలో ప్రజా ఆశీర్వాద సభలో ఎమ్మెల్యే చంద్ర వెంకట వీర మాట్లాడుతూ నియోజకవర్గంలో 1000 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని సత్తుపల్లి అభివృద్ధికి సహకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సాగు, తాగునీరు, విద్యుత్ వంటి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని,

సత్తుపల్లిలో 30 వేల దళిత కుటుంబాలకు దళిత బంధు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ది అని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టినా రాజకీయ స్వార్థంతో కాకుండా మానవీయ కోణంలోనే అన్నారు. సత్తుపల్లిలో నిర్మించిన మున్సిపల్ భవనం, వంద పడకల ఆసుపత్రి, రజిక సోదరుల కోసం రజక భవనం కమ్యూనిటీ హాల్, క్రిస్టియన్ సోదరులకు కమ్యూనిటీ భవనం, ముస్లిం సోదరులకు షాదిఖాన్ నిర్మాణం, డాక్టర్ అంబేద్కర్ భవనం, మినీ ఆడిటోరియంతో పాటు పెనుబల్లి ,కల్లూరు మండల కేంద్రాలలో 50 పడకల ఆసుపత్రులతో పాటు మినీ స్టేడియం నిర్మించామని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా పలు సీసీ రోడ్లు, సైట్ డ్రైనేజీ నిర్మాణాలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉన్నారని,

రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటేసి సత్తుపల్లి నియోజకవర్గంలో తనను నాలుగోసారి ఆశీర్వదించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బండి పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, జిల్లా యువజన విభాగ అధ్యక్షులు చింత నిప్పు కృష్ణ చైతన్య, గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ మహేష్, మండల అధ్యక్షుడు పాలెపు రామారావు, పలు మండలాల ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, బీఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Advertisement

Next Story