ప్రజాభీష్టం మేరకే బీఆర్ఎస్‌లో చేరిక: మడత దంపతులు

by Mahesh |   ( Updated:2023-11-12 07:09:07.0  )
ప్రజాభీష్టం మేరకే బీఆర్ఎస్‌లో చేరిక: మడత దంపతులు
X

దిశ, ఇల్లందు: ప్రజాభిష్టం మేరకే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని మడత దంపతులు ప్రకటించారు. శనివారం ఇల్లందు పట్టణంలోని ఏక్తా హౌస్ భవన్ నందు జరిగిన సభలో మడత దంపతులు మాట్లాడుతూ.. ఇల్లందు నియోజకవర్గంలో ఓ పార్టీ అభ్యర్థి గెలిస్తే, రాష్ట్రంలో మరో పార్టీ అధికారంలోకి వస్తుందని దాని వలన ఇల్లందు నియోజక వర్గం అభివృద్ధి జరగడం లేదని ఇల్లందు పట్టణ ప్రజలు రాష్ట్రంలో ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తుందో ఆ పార్టీకి చెందిన అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఆరు నెలల సుదీర్ఘ కాలంలో నియోజకవర్గంలోని ప్రజల సూచనలు, సలహాలు, అభిప్రాయాలు తీసుకున్న పిదప రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ వస్తుంది కనుక ఈసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలి.

బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తేనే ఇల్లందు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని వేరే అభ్యర్థి ఎవరు గెలిచినా తిరిగి మళ్లీ బీఆర్ఎస్ పార్టీలో చేరాల్సి వస్తుంది. కాబట్టి ఈసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే రాష్ట్రంలో ఇల్లందు నియోజకవర్గంలో ఒకే పార్టీ ఉంటుంది. కనుక ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధి చెందుతుందన్నారు. డబుల్ బెడ్ రూమ్స్ హామీతో బిఆర్ఎస్ లో చేరుతున్నట్లు, గత కొన్నేళ్లుగా పార్టీకి దూరంగా ఉన్న తాము తిరిగి స్పష్టమైన హామీతో బీఆర్ఎస్‌లో చేరడం జరుగుతుందని తెలిపారు.

ప్రస్తుత పరిస్థితిలో ఉన్న రాజకీయ పరిణామాలు దృష్ట్యా ఇల్లందు అభివృద్ధి కాంక్షిస్తూ అధికారంలోకి వచ్చే వారికి సహకరించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల స్పష్టమైన హామీలతో బీఆర్ఎస్ లో చేరాలనుకుంటున్నట్లు తెలిపారు. త్వరలో మూసి వేయబడే జెకె 5 ఓసి ప్రాంతాల్లో 150 ఎకరాల విస్తీర్ణంలో ఇల్లందులో సొంత ఇల్లు లోని సొంత స్థలాలు లేని పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణం చేసి ఇవ్వాలని హామీ తీసుకున్నట్లు తెలిపారు. ప్రజాభిష్ట మేరకే తాము బిఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమైనట్లు స్పష్టం చేశారు. ఇల్లందు నియోజకవర్గంలో బిఆర్ఎస్ అభ్యర్థిని, ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ గెలుపు కొరకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఇల్లందులో హరిప్రియ నాయక్ గెలుపును ఆపడం ఎవరి తరం కాదని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మడత అభిమానులు పాల్గొన్నారు

Advertisement

Next Story

Most Viewed