- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
chalo Delhi : చలో ఢిల్లీని జయప్రదం చేయండి
దిశ,సత్తుపల్లి : పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ వచ్చేనెల 5, 6, 7 తేదీల్లో పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్ తెలిపారు. స్థానిక నియోజకవర్గ సంఘం కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఆ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు దుసా వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య నాయకత్వంలో డిసెంబర్ 5 ,6 ,7 తేదీల్లో ఢిల్లీ కేంద్రంగా కేంద్ర మంత్రులను ప్రతిపక్ష పార్టీల నేతలను వివిధ పార్టీల ఎంపీలను
కలిసి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని విజ్ఞప్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం జంతర్ మంతర్ వద్ద బీసీలలో నెలకొన్న అనేక సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపట్టనున్నట్టు తెలిపారు. కావున మూడు రోజుల పాటు ఢిల్లీలో జరిగే నిరసన కార్యక్రమాలకి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శ్రీనివాస్, యువజన విభాగం సత్తుపల్లి నియోజకవర్గం అధ్యక్షులు మరీదు ప్రసాద్, సంక్షేమ సంఘం సత్తుపల్లి మండల అధ్యక్షులు పామర్తి నాగేశ్వరరావు, యువజన విభాగం సత్తుపల్లి మండల అధ్యక్షులు హమీద్ రామారావు, సాయి, వివిధ మండలాలకు చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
- Tags
- chalo Delhi