- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ సర్కారును సాగనంపాలి.. బీజేపీకి మద్దతు ఇవ్వాలి
దిశ, ఖమ్మం : హైదరాబాద్ విముక్తికి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి... హైదరాబాద్ 75 విముక్తి దినోత్సవం త్వరలోనే రాబోతోంది. సర్దార్ జమాలపురం కేశవరావుకు నా నమసులు. కేసీఆర్ సర్కారును సాగనంపాలి.. బీజేపీకి మద్దతు ఇవ్వాలి అని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం ఖమ్మం నగరంలో సర్దార్ పటేల్ స్టేడియంలో రైతు గోస.. బీజేపీ భరోసా సభకు అయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ వంచించారని, కేసీఆర్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని, కేసీఆర్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని పేర్కొన్నారు. తెలంగాణలో కమలం వికసిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు కిషన్ రెడ్డిని అరెస్టు చేశారని, ఈటల రాజేందర్‌ను అసెంబ్లీ నుంచి బయటకు పంపించారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ 4జీ పార్టీ అని, అంటే నాలుగు తరాల పార్టీ అని, బీఆర్ఎస్ 2జీ పార్టీ అంటే రెండు తరాల పార్టీ అని, ఎంఐఎం 3జీ పార్టీ అంటూ విమర్శించారు. తెలంగాణ ఉద్యమం కోసం అనేక మంది యువకులు ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం రజాకార్ల పక్కన కూర్చొని పాలిస్తోందని విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్నాయని, కేసీఆర్ గద్దె దిగిపోతారని, సంపూర్ణ మెజార్టీలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరుతుందన్నారు. భద్రాచలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిందని, రాముడికి ముత్యాల తలంబ్రాలు సమర్పించడం సంప్రదాయమని, దానిని కేసీఆర్ విడిచిపెట్టారన్నారు. భద్రాచలం వస్తారు.. కానీ రాముడిని దర్శించుకోరని, ఎందుకంటే ఆ కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉందని విమర్శించారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు
కేసీఆర్ రాజకీయ కుట్రలు చేశారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేసిందని, ఇది రైతులు గుర్తుంచుకోవాలన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమానికి రూ. 22వేల కోట్లు ఖర్చు పెట్టారని, ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం దానికి రూ. లక్ష 22 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు. తెలంగాణ నిరుపేద కుటుంబానికి ఇళ్లు మంజూరు చేసిన ఘనత నరేంద్ర మోడీ దే అన్నారు. తెలంగాణ ప్రజల ఆలోచన చేసి సుపరిపాలన కోసం బీజేపీకి ఓటు వేసి ఆశీర్వదించాలన్నారు. ఈ సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మాట్లాడారు.