- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుటుంబ సభ్యుల పాలిట శాపంగా మారిన కన్న తండ్రి.. అసలేమైదంటే?
దిశ,రఘునాథపల్లి: కన్న తండ్రి కుటుంబ సభ్యుల పాలిట శాపంగా మారి ఉన్న ఆస్తినంత కుటుంబ సభ్యులకు తెలియకుండా స్వాహా చేసింది కాకుండా భూమి కొనుగోలు చేసిన రియల్టర్లతో కలిసి కుటుంబ సభ్యులపై దౌర్జన్యానికి పాల్పడుతు, పోలీసులతో బెదిరిస్తున్నట్టు బాధితులు బస్సారీ మోహన్ అతని తల్లి రుషింద్ర భాయి, అక్క స్నేహ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.
మండలంలోని కంచనపల్లి గ్రామంలో తన తాత గారైన బుస్సారీ మల్లాజీ నుండి వారసత్వంగా వచ్చిన 18 ఎకరాలు భూమిలో తన తండ్రి బుస్సారీ లక్ష్మణ్ జి వారి సోదరికి 4ఎకరాలు వరకట్నం కింద ఇచ్చినట్టు వారు తెలిపారు. అయితే గత కొన్ని సంవత్సరాల నుండి తన తండ్రి కుటుంబ బాధ్యతలు విస్మరించి వేరుగా ఉంటున్నాడని వారు వాపోయారు..ఈ క్రమంలో మిగిలిన సుమారు 11ఎకరాల భూమిని క్రమక్రమంగా కుటుంబ సభ్యులకు తెలియకుండా అమ్మేసినట్టు వారు చెప్పారు..ఈ క్రమంలో సర్వే నెంబర్ 988/B/అ /1 లో ఉన్న 1.37 ఎకరాలు, అదేవిదంగా 988/B/అ /2లో ఉన్న 0.33 గుంటలు కలిపి మొత్తం 3.32 ఎకరాల భూమిని ఇతరులకు విక్రయించేందుకు పూనుకున్నాడు అని తెలిపారు. గతంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించగా తన తల్లి పేరిట 1.00 ఎకరం, తన అక్క పేరిట 1.00 ఎకరం, తన పేరిట 1.32 గుంటల భూమిని తన తండ్రి మాకు మాకు ఇస్తున్నట్టు ఒప్పుకోవడంతో పాటు అప్పట్లో రెవిన్యూ కార్యాలయంలో పేర్లు కూడా నమోదు చేసినట్టు వారు తెలిపారు. అయితే తన తండ్రి మళ్ళీ కొన్నాళ్ళకు రెవిన్యూ అధికారులతో మాట్లాడి పేర్లు మార్పులు చేసినట్టు వారు తెలిపారు. ఈ క్రమంలో 2018 సంవత్సరంలో తన తండ్రి లక్ష్మణ్ తమకు కేటాయించిన భూమిని తమకే తెలియకుండ కంచనపల్లి గ్రామానికి చెందిన ప్రదీప్ కు గుంటలు అమ్మినట్టు సమాచారం తమకు తెలియడంతో అప్పటినుండి తాము వారిని అడ్డుకోవడంతో,తన తండ్రే తమ భూమిని కొన్న ప్రదీప్ తో కలిసి పలుమార్లు తమపై దౌర్జన్యం చేయడంతో పాటు తన తల్లిని, చెల్లిని, తనను భూమి వైపు రాకుండా భయభ్రాంతులకు గురిచేసినట్టు వారు వాపోయారు.
గత ఆరు సంవత్సరాల నుండి తమ భూమి విషయమై పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు భూమి విషయంలో బాధితులు కోర్టును ఆశ్రయించి కేసు వేసినట్టు వారు తెలిపారు. ఇంతలో మంగళవారం ఉదయం పోలీసులు మా ఇంటికి వచ్చి మీపై కేసు నమోదు అయినట్టు చెప్పి పోలీస్ వాహనంలో తమను స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి భూమిని కొన్న వారికే వదిలి పెట్టాలంటూ బెదిరింపులకు గురి చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ వేదిస్తున్నారని తెలిపారు,దింతో తమ గోడును ఎవరికీ చెప్పుకోవాలో తెలియక చివరకు మీడియాను ఆశ్రయించినట్టు వారు అన్నారు. కన్న తండ్రే తమ పాలిట శాపంగా మారి భూమిని కొనుగోలు చేసిన వారితో కలిసి చిత్రహింసలకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత జిల్లా పోలీస్, రెవిన్యూ అధికారులు స్పందించి తమ భూమి తమకు దక్కేలా న్యాయం చేయాలనీ,లేని పక్షంలో తమకు ఆత్మహత్యే శరణ్యమని వాపోయారు.