- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
leaders : 100 పడకల ఆసుపత్రి తరలించడానికి వీల్లేదు..
దిశ, తిరుమలాయపాలెం : తనని గెలిపిస్తే, గత ప్రభుత్వ హయాంలో తిరుమలాయపాలెం గ్రామంలో నిర్మించి అందుబాటులోకి తేని 100 పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తెస్తానని ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కానీ ఇప్పుడు గెలిచాక అదే ఆసుపత్రిని కూసుమంచి మండలానికి తరలించే ప్రయత్నం జరుగుతుంటే స్పందించడం లేదని మండల అఖిలపక్షం నాయకులు ఆరోపించారు. మండల ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని తరలించేందుకు వీల్లేదని సోమవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ.. భారీ ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ ఆసుపత్రిని తరలిస్తున్నారనే ఆలోచన మానుకోవాలని కోరుతూ.. అఖిలపక్షం ఆధ్వర్యంలో గత ఆరు రోజులుగా ఆసుపత్రి ఎదుట టెంట్ శిబిరం ఏర్పాటు చేసి రిలే నిరాహార దీక్షలు చేపట్టామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 30 పడకల పీహెచ్సిని, 100 పడకలగా మార్చి, వైద్యులు, ఇతర సిబ్బందిని పెంచి, అభివృద్ధికి 26 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఆసుపత్రి వివరాలు నమోదు చేయకుండా, వేరొక ప్రాంతానికి తరలించాలని భావించడం సరైన నిర్ణయం కాదని మండిపడ్డారు. రూ.26 కోట్ల రూపాయల నిధులు ఇక్కడ ఆసుపత్రి అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి స్పందించి హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అఖిలపక్షం నాయకులు కొమ్ము శ్రీను, కరుణాకర్, బషీర్, శ్రీనివాసరావు, నాగభూషణం, రమేశ్, రాజేంద్రప్రసాద్, వెంకటేశ్వర్లు, దుర్గాప్రసాద్, ఫూలే, కృష్ణ, బాలాజీ, స్వామి, తదితరులు పాల్గొన్నారు.