police : పోలీసులకు పట్టుబడ్డ అంతర్రాష్ట్ర దొంగ..

by Sumithra |
police : పోలీసులకు పట్టుబడ్డ అంతర్రాష్ట్ర దొంగ..
X

దిశ, ఖమ్మం సిటీ : ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు సీసీఎస్, మూడో పట్టణ పోలీసులు సంయుక్తంగా శుక్రవారం గాంధీచౌక్ లో నిర్వహించిన తనిఖీల్లో పాత నేరస్తుడు ఐన ఉమా ప్రసాదును అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ రమణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖమ్మం నగరం, పాండురంగాపురం, బల్లేపల్లి ప్రాంతానికి చెందిన సంపట ఉమాప్రసాద్, (తండ్రి) చంద్రమౌళి, మున్నూరు కాపు రామాలయం వీధికి చెందిన అతను గత కొంతకాలంగా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. అతని వద్ద నుంచి సుమారు రూ.21 లక్షల విలువ చేసే 29 తులాల బంగారు ఆభరణాలు స్వాధీన పరుచుకున్నట్లు తెలిపారు. సారధినగర్ లో గత నెల 20న ఓ ఇంట్లో చోరీ జరిగిందని అదే నెల 25న ఫిర్యాదు దారుడు ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.

అయితే ఉమా ప్రసాద్ పై గతంలో కేరళ, హైదరాబాద్, సూర్యాపేట, పోలీస్ స్టేషన్లో కూడా కేసులు ఉన్నాయన్నారు. ఏడు కేసుల్లో నిందితుడు వద్ద నుంచి 29 తులాల బంగారం ఆభరణాలు రికవరీ చేశామన్నారు. జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లో ఉమా ప్రసాద్ పై జరిగిన కేసులు వివరాలు మీడియాకు వెల్లడించారు. ఖానాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, వైరా పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, ఖమ్మం టూ టౌన్ పరిధిలో 3, ఖమ్మం 3 టౌన్ పరిధిలో ఒక కేసుల్లో దొంగతనాలకు పాల్పడినట్లుగా నిందితుడు ఒప్పుకున్నట్లు ఎసీపీ అన్నారు. మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 212/2024, యూ/ఎస్ ఐపీసీ సెక్షన్ లు 457, 380 క్రింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో సీసీఎస్, ఏసీపీ భోజరాజు, మూడో పట్టణ సీఐడీ.రమేష్ , సీసీఎస్ ఇన్స్పెక్టర్లు బి. బాలాజీ, బి.రాజు, సిబ్బంది మంగిత్య, గజేంద్ర, శ్రీనివాస్, సుధాకర్ లు పాల్గొనగా వీరందరిని సీపీ అభినందించారు.



Next Story