- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కప్పలబంధం గ్రామంలో అమానుషం...బాలింత పై దాడి
దిశ, కల్లూరు : ఖమ్మం జిల్లా, కల్లూరు మండలం, కప్పల బంధం గ్రామంలో బాలింత పై కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటన శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పొట్టేటి వెంకట నారాయణ రెడ్డి మూడు సంవత్సరాల క్రితం ఓ దళిత యువతి పూజితను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో నారాయణరెడ్డి దళిత యువతి ఇరువురు కప్పల బంధం గ్రామంలోని నారాయణరెడ్డి తల్లి పొట్టేటి విజయ లక్ష్మి కి చెందిన సొంత ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం అదే గ్రామానికి చెందిన తల్లపురెడ్డి భద్రారెడ్డి, తల్లపురెడ్డి కోటిరెడ్డి, తల్లపురెడ్డి అంజిరెడ్డి అనే ముగ్గురు వ్యక్తులు మధ్యాహ్నం ఇంట్లో తన చంటి బిడ్డకు పాలిస్తున్న సమయంలో బాలింత పూజిత పై దాడి చేసి కులం పేరుతో దూషిస్తూ ఇంట్లో సామాన్లను బయటికి విసిరేశారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ బాధిత మహిళ శనివారం సాయంత్రం కల్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడు సంవత్సరాల నుంచి తమ అత్తగారికి చెందిన ఆస్తిని కాజేయాలనే ఉద్దేశ్యం తో కప్పల బంధం గ్రామానికి చెందిన తల్లపురెడ్డి భద్రారెడ్డి ,తల్లపురెడ్డి అంజిరెడ్డి, తల్లపురెడ్డి కోటిరెడ్డి అనే ముగ్గురు వ్యక్తులు పలుమార్లు తమపై దాడి చేశారని పేర్కొంది. తక్షణమే ఇల్లు వదిలి వెళ్లిపోకపోతే మీ అంతు చూస్తామంటూ తరచూ బెదిరిస్తున్నారని కన్నీరు మున్నీరుగా విలపించింది. ఈ విషయమై గతంలో కల్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీస్ అధికారులు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తమ పై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరింది.