- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
MLA Matta Ragamai Dayanand : కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం
దిశ,సత్తుపల్లి : ఖమ్మం జిల్లాకు సీతారామ ప్రాజెక్టు నిర్మాణంకు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 8.వేల కోట్లు ఖర్చు చేసి 35% పనులు పూర్తి చేసిందని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు. మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు మాజీ ఎమ్మెల్యే లతో హైదరాబాద్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, సీతారామ ప్రాజెక్టులో 90.% పనులు పూర్తి చేసిందని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 90% పనులు పూర్తయితే సీతారామ లింక్ కెనాల్ ఏర్పాటు చేసి సాగర్ కాలువకు కలిపి నీళ్లు ఎందుకు అందించలేదని ఆమె ప్రశ్నించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లించకుండా పోతే కాంగ్రెస్ ప్రభుత్వమే చెల్లించి సీతారామ ప్రాజెక్టు పనులు పూర్తి చేసిందని, ఖమ్మం జిల్లా ను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు నిరంతరం కృషి చేసి సీతారామ ప్రాజెక్టు లింకెనాలను ప్రారంభిస్తుంటే వారిపై ఆరోపణలు చేయడం తగదన్నారు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర సీతారామ ప్రాజెక్ట్ లో యాతాల కుంట నిర్వాసితులకు 12. కోట్లు చెల్లించకుండా ఉంటే ప్రస్తుత ప్రభుత్వం 12. కోట్లు నిర్వాసితులకు చెల్లించిందని, ఆయన 8.నేలలు కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసిందని ఆరోపణలు చేయటం అర్ధరహితమన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్ల కోసం కక్కుర్తి పడి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని 80. వేల పుస్తకాలు చదివిన అజ్ఞాని కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టుపై ఎందుకు మాట్లాడటం లేదని ఆమె ప్రశ్నించారు,బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వం పై మంత్రులపై అడ్డగోలు ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఆమె హెచ్చరించారు.వైరా లో జరుగునున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన,సభ కు జిల్లా నాలుములు నుంచి లక్షలాది మంది కార్యకర్తలు తరలివచ్చి జయప్రదం చేయాలని ఆమె కోరారు, ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శివ వేణు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉడతనేని అప్పారావు, చల్లగుళ్ళ నరసింహారావు, గాదె చెన్నారావు, దొడ్డాకుల గోపాలరావు, గోలి శ్రీనివాస్ రెడ్డి, భీమిరెడ్డి సుబ్బారెడ్డి, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణ వరపు శ్రీనివాసరావు, వార్డ్ కౌన్సిలర్లు కంటే నాగలక్ష్మి, గఫార్, వినుకొండ కృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.