'ప్రజల ప్రాణాలతో చెలగాటం.. అనుమతులు లేని పాల కేంద్రం'

by Vinod kumar |
ప్రజల ప్రాణాలతో చెలగాటం.. అనుమతులు లేని పాల కేంద్రం
X

దిశ, ఖమ్మం సిటీ: ఖమ్మంలో అధికార పార్టీ అండతో అన్ని రకాల అక్రమా వ్యాపారాలు కొనసాగుతున్నాయని చెప్పడానికి సజీవ సాక్ష్యంగా కల్తీ పాల విషయం వెలుగులోకి వచ్చింది. బాయిలర్ బ్లాస్ట్ కావడంతో నగరంలో కల్తీపాల బాగోతం బయటపడింది. గోపాలపురంలో 8వ డివిజన్‌లో ఒక ఇల్లును అద్దెకు తీసుకుని హనుమాన్ పాల డైరీ పేరుతో అనుమతి లేని పాలను తయారు చేస్తున్నారు. పాలకేంద్రంలో బాయిలర్ బ్లాస్ట్ కావడంతో కల్తీ పాలు తయారు చేస్తున్న విషయం బయటపడింది. పాలకేంద్రంలో భారీ మొత్తంలో ఫ్రీడమ్ ఆయిల్ క్యాన్లు, పాలపొడి మిశ్రమాన్ని మీడియా ప్రతినిధులు గుర్తించారు. తయారు చేసిన పాలను డెయిరీ కేంద్రాలకు తరలిస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారు నిర్వాహకులు. అధికారుల నామ మాత్రపు తనిఖీల్లో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.


అసలు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏమి చేస్తున్నారో నిర్వాహకులు ఎందుకు ఎలాంటి అనుమతులు లేకుండా హనుమా పాల ఫ్యాక్టరీ ఎలా నడిపారో జిల్లా స్థాయి అధికారులు విచారణ జరిపితే మరిన్ని విషయాలు బయటకొస్తాయి అని స్థానికులు వాపోతున్నారు. కల్తీ పాలు తయారు చేస్తున్న డైరీలో బాయిలర్ బ్లాస్ట్ అవడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భారీ స్థాయిలో బాయిలర్ బ్లాస్ట్ అయి మహిళకు చిన్నపాటి గాయాలు అయ్యాయి. స్థానికంగా ఎలాంటి ప్రాణనష్టం జరగక పోవడం స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.


డైరీ ఫామ్‌లో పనిచేసే మహిళ తలకు తీవ్ర గాయమైంది. బాయిలర్ అకస్మాత్తుగా పేలడంతో ఆ పేలుడి దాటికి ప్రహరీ గోడ పూర్తిగా పడిపోయింది. అక్కడి వచ్చిన ఫుడ్ సేఫ్టీ అధికారులు డైరీ కి అనుమతులు లేవని తేల్చేశారు. ఆంధ్ర నుంచి వచ్చిన సదరు వ్యక్తికి అధికార బీఆర్ఎస్ లో నగర స్థాయి పదవి హోద ఉన్న వ్యక్తి అన్ని రకాల సహకారాలు అందిస్తున్నట్లు తెలుస్తుంది. పాల డైరీ లో అధికార పార్టీతో అంటగాకుతు తిరుగుతున్న ఓ కాంట్రాక్టర్‌కు చెందిన ఖాళీ మిల్క్ ప్యాకెట్లు అక్కడ దర్శన మిచ్చాయి. దాంతో అధికార పార్టీ నాయకుల జోక్యం, సహకారం పూర్తి స్థాయిలో ఉండటం వల్లనే ఈ అక్రమ దందా కొనసాగుతున్నట్లుగా ప్రజలు చర్చించుకుంటున్నారు. అధికార పార్టీ సదరు నాయకుల పై ఇప్పటికే అనేక రకాల భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీలో ఉండి అరాచకాలు సృష్టిస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Advertisement

Next Story