సెల్ ఫోన్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య

by Naveena |   ( Updated:2024-12-30 16:59:01.0  )
సెల్ ఫోన్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య
X

దిశ, జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని వెంగన్నపాలెం గ్రామానికి చెందిన ఇల్లంగి సాకేత్ (21) తన తల్లిదండ్రులు కొత్త సెల్ ఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగా లేదని, కొద్దిరోజుల తర్వాత కొనిస్తామని తల్లిదండ్రులు చెప్పగా వినలేదు. తన స్నేహితులందరూ మంచి సెల్ఫోన్లు వాడుతున్నారని, తనకు లేదని ఎవరూ లేని సమయంలో సోమవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు జూలూరుపాడు ఎస్సై రవి కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story