గోదావరి జలాలతో జిల్లాను సస్యశ్యామలం చేస్తా.. మంత్రి తుమ్మల ప్రకటన

by Nagam Mallesh |
గోదావరి జలాలతో జిల్లాను సస్యశ్యామలం చేస్తా.. మంత్రి తుమ్మల ప్రకటన
X

దిశ, ఖమ్మంః గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సస్యశ్యామలం చేయడమే తనన రాజకీయ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సీతారామ ప్రాజెక్ట్ పనులు, తదితర అంశాలపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తన 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో ప్రాజెక్టల కోసమే వెంపర్లాడానని తెలిపారు. గోదావరి జలాలు ఉమ్మడి జిల్లాల్లో రావాలంటే దుమ్ముగూడెం వద్ద ప్రాజెక్టు నిర్మించాలని తానే చెప్పినట్టు తెలిపారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టు కు నాటి ప్రభుత్వాలు అనుకూలంగా స్పందించాయని గుర్తు చేశారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే దుమ్ముగూడెం ప్రాజెక్ట్ ని ఇందిరా సాగర్ రాజీవ్ సాగర్ అని రెండు విభాగలుగా విభజించామన్నారు. నాడు ఇదే ప్రాజెక్టు కోసం పాదయాత్ర కూడా చేసినట్టు తెలిపారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీతారామ ప్రాజెక్టు పనులు ముందుకు సాగలేదని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టి జిల్లాకు రాగానే ఇరిగేషన్ అధికారులను పిలిపించి పనులను వేగాంతం చేయాలని ఆదేశించడంతో ఆరు నెలలు కాలంలో పనులు పరుగులు పెట్టాయన్నారు. మూడు మోటార్ల ద్వారా ఈరోజు గోదారి జలాలు వస్తున్నాయని దురాశతో ఈరోజు ప్రతిపక్షాలు ఇస్తాను సారంగా మాట్లాడుతున్నారన్నారు. మీ హయాంలో చేయకుండా ఈరోజు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం మీ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. మీ హయాంలో రైతు రుణమాఫీ, ప్రాజెక్ట్ నిర్మాణాలపై వాట్సాప్ ద్వారా తెలుసుకోవాలని సూచించారు. సీతారామ ప్రాజెక్టు పనులను ఎలా జరుగుతున్నాయో సంబంధిత మంత్రులను తీసుకెళ్లి చూపిస్తే వీళ్ళకి కడుపుమన్నుతుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా నా భూములకు నీళ్లు రావు అని సూచించారు. నా ప్రజలు.. నా రైతుల కోసమే తుమ్మల పనిచేస్తాడు తప్ప ఏదో స్వార్థ రాజకీయాల కోసం చేయడని ఆయన వివరించారు. ఆరు నెలల నుంచి సీతారామ ప్రాజెక్ట్ పనులకు ఎలాంటి అడ్డంకులు వచ్చినా వాటిని అధిగమించి పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఏది ఏమైనా సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఉమ్మడి జిల్లాలకు సాగుకు, త్రాగు వినియోగిచడం తన లక్ష్యమన్నారు.

Next Story

Most Viewed