- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫిక్డ్స్ డిపాజిట్లపై ఏపీజీవీబీలో అధిక వడ్డీ : బ్యాంకు మేనేజర్
దిశ, వేంసూర్ : ఫిక్డ్స్ డిపాజిట్లపై అన్ని బ్యాంకుల కంటే గ్రామీణ వికాస్ బ్యాంక్ ఎక్కువ వడ్డీ ఇస్తుందని ఆ బ్యాంకు మేనేజర్ కిషన్ కుమార్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వికాస్ 777 రోజుల పథకంలో డిపాజిట్ చేస్తే వయోజనులకు 7.5 శాతం, వికాస్ 444 రోజుల పథకంలో 7.1 శాతం, ఇవే పథకాలకు సీనియర్ సిటిజన్ లకు 8.0 నుంచి 7.6 శాతం చొప్పున వడ్డీ ఇస్తామని పేర్కొన్నారు. కొన్ని రోజులు మాత్రమే ఈ అవకాశం ఉందని చెప్పారు. అలాగే గృహ నిర్మాణ రుణాలపై కూడా అన్ని బ్యాంక్ ల కన్నా అతి తక్కువ వడ్డీకే రుణాలు మంజూరు చేస్తున్నామని, ప్రారంభ వడ్డీ 8.45 శాతం మాత్రమేనని, బంగారు ఆభరణాలపై అతి తక్కువ వడ్డీ, తక్షణ మంజూరు, ఒక గ్రాముకి 3950 రూపాయల చొప్పున రుణం ఇస్తామని తెలిపారు. ప్రారంభ వడ్డీ కేవలం 9.0 శాతం మాత్రమేనని తెలిపారు. పీఏమ్ఎస్ బీ వై కింద రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా ప్రీమియం కేవలం ఏడాదికి 20 రూపాయలు మాత్రమేనని, పీఎంజేజేబీ వై జీవిత బీమా ఏడాదికి కేవలం 436 రూపాయలు మాత్రమేనని వివరించారు. అటల్ పెన్షన్ యోజన పథకం కూడా తమ బ్యాంక్ లో ఉందని అతి తక్కువ పెట్టుబడితో వృద్దాప్యంలో అత్యధిక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగదు అధికారి నల్లoటి మనోజ్, బ్యాంక్ క్లర్క్ నరేంద్ర పాల్గొన్నారు.