- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుదిబండలా గ్యాస్ సిలిండర్ : ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఆగ్రహం
దిశ, అశ్వారావుపేట : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక గ్యాస్ బండ పేదల పాలిట గుదిబండగా మారిందని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మండిపడ్డారు. అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెరిగిన వంట గ్యాస్ ధరలను నిరసిస్తూ వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తుందన్నారు. గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడం దారుణమైన చర్య అని.. ఇప్పటికైనా కేంద్రానికి కనువిప్పు కలిగి పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, సర్పంచులు నారం రాధా, సాధు జ్యోత్స్నా భాయ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బండి పుల్లారావు, టౌన్ ప్రెసిడెంట్ సత్యవరపు సంపూర్ణ, నాయకులు మందపాటి రాజమోహన్ రెడ్డి, తాడేపల్లి రవి, తాళం సూరి, కలపాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.