- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అధికార పార్టీ నాయకుల్లో పెరుగుతున్న రాజకీయ కక్షలు’
దిశ, తూప్రాన్, మనోహరాబాద్ : సాక్షాత్తు సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్న మనోహరాబాద్ మండలంలో రోజురోజుకు అధికార పార్టీ నాయకులలో రాజకీయ కక్షలు పెరుగుతున్నాయి. దీంతో ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకోగా ఇరు వర్గాల నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ సంఘటన మనోహరాబాద్ పోలీస్ స్టేషన్లో ఈనెల 13న చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మండలంలోని కాలకల్ జాతీయ రహదారి వెంట ఉన్న ఆర్ఆర్‌సి ప్రైవేట్ లిమిటెడ్ తరుణ్ వెంచర్‌లో గత ఏడాది జనవరి నెలలో హైదరాబాద్‌కు చెందిన పింజాల వెంకట సుబ్రహ్మణ్యం వద్ద 38, 39, 40, 41 నెంబర్లు కలిగిన 1056 గజాలలో నాలుగు ప్లాట్లను తాము కొనుగోలు చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్నామనీ మనోహరాబాద్ మండలానికి చెందిన ఉమ్మడి మండల సొసైటీ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకుడు చంద్రశేఖర్ ముదిరాజ్, తూప్రాన్ మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు భగవాన్ రెడ్డి, కాల్లకల్ కు చెందిన నత్తి వంశీలు బుధవారం తెలిపారు.
దీంతో తాము గత ఏడాది మార్చి నెలలో తమ ప్లాట్లకు ఫ్రీ కాస్ట్ వాలు గోడను నిర్మించుకుంటే కాలకల్ గ్రామానికి చెందిన గిరిధర్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, సీతారామరెడ్డిలు ఈ ప్లాట్లు మావి అని ఫ్రీ కాస్ట్ వాళ్ళు గోడను కూల్చివేశారని తెలిపారు. దీంతో తాము అప్పట్లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారు కూడా తమపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అప్పట్లో కేసులు నమోదయ్యాయని తెలిపారు. తాము కొనుగోలు చేసిన ప్లాట్ల రిజిస్ట్రేషన్ పత్రాలతో కోర్టును ఆశ్రయించగా ప్రస్తుతం కోర్టులో కేసు వేయగా తమకు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారని వారన్నారు. తమ ప్లాట్ల పక్కనే గిరిధర్ రెడ్డి , సీతారాం రెడ్డి లకు చెందిన స్థలంలో మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, వైఫ్ ఎంపీపీ సోదరులు స్థలాన్ని లీజకు తీసుకొని ధర్మకాంట, షెడ్ల నిర్మాణం చేస్తున్నారని వారన్నారు.
ఈ నిర్మాణాల వెనుక మరికొందరి ప్లాట్లు ఉండడం వల్ల ఆ ప్లాట్లకు అడ్డంగా నిర్మించడంతో గుర్తుతెలియని వ్యక్తులు నిర్మించిన షెడ్లను ధ్వంసం చేశారని, ఈ షెడ్లను తామే ధ్వంసం చేసినట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని వారన్నారు. ఇదిలా ఉండగా తాము కొనుగోలు చేసిన నాలుగు ప్లాట్ల స్థలంలో తమకు ఎలాంటి సమాచారం లేకుండా కంకర , డస్టును వేయడంతో తాము గిరిధర్ రెడ్డి, సీతారాం రెడ్డి, మురళీధర్ రెడ్డి , సుధాకర్ రెడ్డి, విట్టల్ రెడ్డి లపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. వీరు దౌర్జన్యంగా తమ ప్లాట్ల స్థలాన్ని అక్రమంగా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ కక్షలు దృష్టిలో పెట్టుకొని ఇటువంటి అగాయిత్యలకు పాల్పడుతున్నారు ఈ సందర్భంగా వారు తెలిపారు.