- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రీన్ ఇండియా చాలెంజ్ భావితరాలకు స్ఫూర్తి
దిశ, ఖమ్మం రూరల్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ స్థాపించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి అభిప్రాయపడ్డారు. మంగళవారం గ్రీన్ ఇండియా చాలెంజ్ ఖమ్మం జిల్లా (వైరా మండలం పాలడుగు గ్రామానికి చెందిన) కోఆర్డినేటర్ డాక్టర్ కేసగాని రాజశేఖర్ గౌడ్, ఆయన సతీమణి కేసగాని సుజన ఆధ్వర్యంలో తనికెళ్ల భరణి హైదరాబాదులో తన నివాసంలో ఒక మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడాన్ని ఒక ఉద్యమంగా చేపడుతున్న
సంతోష్ కుమార్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఆయన ఆధ్వర్యంలో రూపొందించిన వృక్ష వేదం పుస్తకం అరుదైన మొక్కల గురించి అద్భుతమైన సమాచారం అందించారన్నారు. ఈ పుస్తకం భావితరాలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా ఖమ్మం జిల్లాలో ప్రతి గుడిలో జమ్మి మొక్క నాటిన రాజశేఖర్ గౌడ్ అభినందనీయులన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను కూడా తీసుకోవడం గొప్ప విషయం అన్నారు. అనంతరం తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని తనికెళ్ల భరణి ని రాజశేఖర్ గౌడ్, ఆయన సతీమణి సుజన శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామంతో తనకున్న అనుబంధాన్ని తనికెళ్ల భరణి నెమరు వేసుకున్నారు.