- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి
దిశ, వైరా : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తుందని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డి, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన 100 శాతం ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేప పిల్లలను కొనుగోలు చేసి 100 శాతం రాయితీపై చేప పిల్లలను చెరువులు, కుంటలలో విడుదల చేస్తుందన్నారు. వైరా రిజర్వాయర్లో పోసిన చేప పిల్లల ఎదుగుదలకు మత్స్యకారులు కృషి చేయాలని కోరారు.
మత్స్యకారులకు చేపల వేటతో ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. వైరా రిజర్వాయర్ లో 14 లక్షల చేప పిల్లలను విడుదల చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖ అధికారి శివప్రసాద్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మార్క్ఫెడ్ రాష్ట్ర మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, మత్స్య సొసైటీ చైర్మన్ రహీం, జిల్లా కన్వీనర్ మామిడి వెంకటేశ్వర్లు, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ సీతారాములు, మున్సిపల్ కమిషనర్ వేణు, సహకార సంఘం సభ్యులు పాల్గొన్నారు.