అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎడవల్లి

by Mahesh |   ( Updated:2022-12-06 07:11:03.0  )
అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎడవల్లి
X

దిశ, పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలో అంబేద్కర్ సెంటర్ నందు మంగళవారం DR BR అంబేద్కర్ 66 వ వర్ధంతి సందర్భంగా పాల్వంచ అంబేద్కర్ సెంటర్ లో గల అంబేద్కర్ విగ్రహానికి TPCC సభ్యులు ఎడవల్లి కృష్ణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎడవల్లి కృష్ణ మాట్లాడుతూ ప్రపంచం గర్వించదగిన ప్రముఖులలో ముఖ్యుడు మన అంబేద్కర్ అని,భారతదేశంలో ఉన్న అన్ని రకాల వ్యవస్థలకు రూపకల్పన చేసి మన దేశాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసిన మహోన్నత వ్యక్తి మన అంబేద్కర్ అని,రాజ్యాంగ శిల్పి,ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారు.

స్వాతంత్ర్య భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, భారతరత్న, ఎవరి కుల వృత్తిని వారు అనుసరించడం వల్ల ఎటువంటి పోటీ లేని ఆర్థిక వ్యవస్థ భారత సమాజంలో ఉన్నదని ఆయన సమర్థించాడు. అంటరానివారుగా భావిస్తున్న కులాల వారు తమ ఆత్మగౌరవాన్ని త్యాగం చేస్తూ సమాజం బాగు కోసం తాము చేసే వృత్తులను చేస్తున్నారని, అటువంటి వారిని ఇతర వర్ణముల వారందరూ గౌరవించాలని అన్నారాన్నారు. ఈ కార్యక్రమంలో INTUC SA జలీల్,పాల్వంచ పట్టణ మైనారిటీ అధ్యక్షుడు చాంద్ పాషా, పాల్వంచ పట్టణ OBC అధ్యక్షుడు చారీ, లోగానీ మురళి, సోషల్ మీడియా నియోజకవర్గ కో - కో ఆర్డినేటర్ షఫీ, భద్ధి కిషోర్, రాము నాయక్, చంద్రగిరి సత్యనారాయణ, భద్రు, నరేష్, అమీర్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : రాజ్యాంగ నిర్మాతకు రాష్ట్రపతి, ప్రధాని ఘన నివాళి

Advertisement

Next Story

Most Viewed