డీఎస్సీ అభ్యర్థులు కౌన్సిలింగ్ కి హాజరు కావాలి

by Kalyani |
డీఎస్సీ అభ్యర్థులు కౌన్సిలింగ్ కి హాజరు కావాలి
X

దిశ, కొత్తగూడెం: డీఎస్సీ 2024 లో ఎన్నికై, ఈనెల 10వ తేదీన జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో రిపోర్టు చేసిన అభ్యర్థులందరికీ కౌన్సిలింగ్ ప్రక్రియ మంగళవారం జరగనున్నదని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. వెంకటేశ్వర చారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుండి అన్ని సబ్జెక్టుల అభ్యర్థులకు పాత కొత్తగూడెం మార్వాడి క్యాంపులో తెలంగాణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ (జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆనంద ఖని) నందు కౌన్సిలింగ్ జరిపి పాఠశాలలు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. కౌన్సిలింగ్ కు హాజరయ్యే అభ్యర్థులు వారి వెంట ఫొటోతో కూడిన వారి నియామక పత్రాన్ని, రెండు పాస్ పోర్ట్ ఫొటోలను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు. కౌన్సిలింగ్ ప్రక్రియ ర్యాంకుల ఆధారంగా మెరిట్ ప్రకారం జరుగుతుందని, ఖాళీల వివరాలు కౌన్సిలింగ్ హాల్ బయట ప్రదర్శింపబడతాయని, కాబట్టి అభ్యర్థులు ఎటువంటి ఆందోళనకు గురికాకుండా కౌన్సిలింగ్ కు హాజరు కావాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed