ఎమ్మెల్యే సమక్షంలో డిష్యుం డిష్యూం

by Sridhar Babu |
ఎమ్మెల్యే సమక్షంలో డిష్యుం డిష్యూం
X

దిశ, ఇల్లందు : ఇల్లందు మున్సిపాలిటీలో చైర్మన్, కౌన్సిలర్ల మధ్య హోరాహోరీ తగాదాలు గతంలో జరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగడం విధితమే. ఇల్లందు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం శనివారం జరగగా చైర్మన్ డీవీ, వైస్ చైర్మన్ జానీ పాషా వర్గాలుగా ఏర్పడి దూషించుకోవడంతోపాటు దాడి చేసే వరకు కౌన్సిల్ సమావేశం జరిగింది. వివరాల్లోకి వెళితే... ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు 2024- 25 సంవత్సరానికి గాను స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య సమక్షంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో చైర్మన్ డీవీ, వైస్ చైర్మన్ జానీ పాషా పై దాడికి పాల్పడ్డాడు. సాధారణ కౌన్సిల్ సమావేశంలో వైస్ చైర్మన్ జానీ పాషా తీర్మానాలను ప్రశ్నించడంతో పాటు మూడు రోజులుగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు తమకు రావాల్సిన జీతపు

బకాయిలు రాలేదని మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహిస్తున్నా పట్టించుకోకపోవడం లేదన్నారు. వారికి రావలసిన పీఎఫ్ నిధులను విడుదల చేయడమే కాకుండా జీరో వన్ ఎకౌంటు కు మున్సిపల్ నిధులను జమ చేయకుండా కొత్తగూడెంలోని ఐసీఐసీఐ అకౌంట్ కి ఎందుకు జమ చేస్తున్నారని కమిషనర్ ను ప్రశ్నించారు. వార్డులలో పనిచేసే కార్మికుల అవసరాలను తీర్చకుండా అనవసర ఖర్చుల నిమిత్తం మున్సిపాలిటీకి సంబంధించిన నిధులను ఎందుకు ఖర్చు చేస్తున్నారని వైస్ చైర్మన్ జానీ పాషా కమిషనర్ ను ప్రశ్నించారు. వార్డులలో పారిశుద్ధ్య కార్మికుల గ్యాంగు వర్కులకు ఫొటోలకు ఫోజులిస్తున్నారే తప్ప వార్డుల అభివృద్ధిని, ఇల్లందు అభివృద్ధిని అటకేకిస్తున్నారని అన్నారు. దాంతో మున్సిపల్ చైర్మన్ కలగజేసుకొని ఎవరు ప్రశ్నించని వాటికి మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారని, గతంలో మీరు మున్సిపల్ కమిషనర్తో సైతం దురుసు ప్రవర్తనతో తమరిపై

కేసులు పెట్టి జైలు పాలు చేయడం జరిగిందని రెచ్చగొట్టడంతో మున్సిపల్ వైస్ చైర్మన్ మరల కలగజేసుకొని తాను ఏమి తప్పు చేయలేదని, ప్రజల ఇబ్బందులను గురి చేసే విధంగా ఫ్లెక్సీల విషయంలో ప్రశ్నించినందుకే తనను జైలు పాలు చేశాడని అన్నారు. మీలా పేకాట పాపారాయుడుని కాదని ఇతరుల వ్యక్తిగత జీవితాలలోకి తొంగి చూడలేదని, హద్దు మీరి ప్రవర్తించొద్దని చైర్మన్ ను హెచ్చరించారు.

కోపోద్రిక్తుడైన మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పై చేయి చేసుకోవడంతో కౌన్సిలర్ సమావేశం రసాభాసగా జరిగింది. కౌన్సిల్ సమావేశంలో ఉన్న కౌన్సిలర్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటూ వ్యక్తిగత అంశాలను ప్రస్తావించడంతో స్థానిక ఎమ్మెల్యే సముదాయించారు. అనంతరం ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రతి వార్డులోని సమస్యలను వార్డు కౌన్సిలర్ ద్వారా విని ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తానని ప్రతి వార్డు కౌన్సిలర్, అధికారులతో సమన్వయంతో పనిచేయాలని సూచనలు చేయడంతో సభ ముగిసింది.

Next Story

Most Viewed