దిశ ఎఫెక్ట్... అనుమతులు లేకుండా భవనాలు నిర్మించడంపై స్పందించిన అధికారులు

by Sridhar Babu |
దిశ ఎఫెక్ట్... అనుమతులు లేకుండా భవనాలు నిర్మించడంపై స్పందించిన అధికారులు
X

దిశ,సత్తుపల్లి : సత్తుపల్లి మండల పరిధిలోని కిష్టారం గ్రామంలో సింగరేణి సంస్థ అనుమతులు లేకుండా భవనాలు నిర్మించడంపై దిశ దినపత్రికలో ఏప్రిల్ 18 తేదీన ప్రచురితమైన పర్మిషన్ లేకుండా పనులు అనే కథనానికి సింగరేణి ఉన్నతాధికారులు స్పందించారు. కిష్టారం గ్రామపంచాయతీ గ్రూప్ డెవలప్మెంట్ స్కీం ప్రకారం కిష్టారం గ్రామపంచాయతీకి సింగరేణి సంస్థ

చెల్లించాల్సిన 41,70,000 (నలబై ఒక లక్ష డెభై వేల రూపాయలు) చెక్కును శుక్రవారం కిష్టారం ఓసీ ప్రాజెక్టు ఆఫీసర్ వేదాద్రి నరసింహారావు, సివిల్ డీవైఎస్ఈ రవికుమార్, కిష్టారం గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీఓ సీహెచ్ వీ నాగేశ్వరరావు, గ్రామ కార్యదర్శి రవికి అందజేశారు. సహకరించిన దిశ దినపత్రిక యాజమాన్యానికి కిష్టారం గ్రామస్తులు, ప్రభుత్వ అధికారులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Next Story

Most Viewed