కాంగ్రెస్ లో చేరికలకు ఆషాడం....అడ్డు

by Kalyani |
కాంగ్రెస్ లో చేరికలకు ఆషాడం....అడ్డు
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో/అలంపూర్: ఉమ్మడి పాలమూరు జిల్లా ఒక ఎమ్మెల్సీ, మిగిలి ఉన్న ఒక ఎమ్మెల్యే సైతం కారు దిగి చెయ్యి అందుకోవడానికి సిద్ధం అయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వెనకబడిన అలంపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీలో చేరవలసిందే.. అన్న ఆలోచనలకు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయం అని గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బి ఆర్.ఎస్ అభ్యర్థులుగా పోటీ చేసి అలంపూర్, గద్వాల ఎమ్మెల్యేలుగా బండ కృష్ణమోహన్ రెడ్డి, విజయుడు గెలుపొంది పార్టీ పరువు కొంతమేరకు కాపాడగలిగారు.

కానీ గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి ముందుగానే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో భేటీ కావడం ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఇరువురు పార్టీ మారడం ఖాయం అని నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం సాగుతోంది. మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి వస్తున్న నేపథ్యంలో వారి చేరిక ఉండవచ్చు అని కొందరు.. ఈనెల 11వ తేదీన హైదరాబాద్ వెళ్లి చేరే అవకాశాలు ఉన్నాయని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఇరువురు పార్టీ మారడం ఖాయం.. ఈ రెండు మూడు రోజులలో పార్టీలో చేరుతారా.. కొత్త ఆలస్యం అవుతుందా అన్న అంశంపై జోగులాంబ గద్వాల జిల్లాలో చర్చలు సాగుతున్నాయి.

ఆషాడ మాసం చేరికలకు అడ్డుగా ఉంది అని. ఈనెల 21వ తేదీన ఆషాడ మాసం ముగిసిన తర్వాత పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని మరికొందరు అంటున్నారు. మొత్తం పై ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలలో ఒకరు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరుపోగా. త్వరలోనే మిగిలిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్ల వెంకటరామిరెడ్డి సైతం చెయ్యి అందుకోనుండడంతో బి ఆర్ ఎస్ పరిస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లాలో మరింత దయనీయంగా మారనుందీ. కాగా ఈ రోజు హైదరాబాదులోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

అలంపూర్ నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్షించారు. ఎమ్మెల్సీ ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇచ్చారు. రాయచూరు -ఐజ -శాంతినగర్ -అలంపూర్ - నందికొట్కూరు - శ్రీశైలం ( అంతర్రాష్ట్ర హైవే ) 4వే లైన్ రోడ్డు వేస్తే బాగుంటుందని జోగులాంబ ఆలయం అభివృద్ధి అవుతుందని, మల్లమ్మ కుంట రిజర్వాయర్ వల్లూరు రిజర్వాయర్,అలంపూర్ వాసులకు ఆరోగ్యశ్రీ ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ లో కూడా వర్తించేలా... నెట్టెంపాడు 100 ప్యాకేజ్ పై.. ఇలా పాలు... అంశాలు ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేశారు.

Advertisement

Next Story