ఆ స్టార్ హీరోయిన్‌కు చాలా పొగరు.. పెద్ద హీరోలను కూడా లెక్కచెయ్యదు.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్

by sudharani |
ఆ స్టార్ హీరోయిన్‌కు చాలా పొగరు.. పెద్ద హీరోలను కూడా లెక్కచెయ్యదు.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్‌లో టాలెంటెడ్ దర్శకుడు మారుతి ఒకరు. ‘ఈ రోజుల్లో’ అనే చిత్రంతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈయన.. ఎక్కువగా యూత్‌ను ఆకట్టుకునే కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు. ఈ క్రమంలోనే ‘ఈ రోజుల్లో’ మూవీ సూపర్ హిట్ తర్వాత వచ్చిన.. బస్ స్టాప్, ప్రేమకథ కూడా వరుస హిట్స్ అందుకోవడంతో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. నేచురల్ స్టార్ నాని ‘భలే భలే మగాడివోయ్’ తో బ్లాక్ బస్టర్ అందుకుని టాప్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరిపోయాడు. దీంతో అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ వాటి సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు ఈ డైరెక్టర్. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మారుతి.. ఓ స్టార్ హీరోయిన్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

మారుతి డైరెక్షన్‌లో వచ్చిన ‘బాబు బంగారం’ మూవీలో నయనతార హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ మూవీ షూటింగ్ టైంలో నయన్, మారుతికి మధ్య ఓ చిన్న వివాదం జరిగిందట. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మారుతి మాట్లాడుతూ.. ‘‘బాబు బంగారం’ షూటింగ్ టైంలో చిత్ర బృందానికి నయన్ సహకరించేది కాదు. నేను అప్పటికి పెద్ద డైరెక్టర్ కానప్పటికీ.. నన్ను గౌరవించకపోయినా పర్లేదు. కానీ వెంకటేష్‌లాంటి సీనియర్ హీరోలను కూడా ఆమె లెక్క చేసేది కాదు. నేను ఎంతో ఓపికగా భరించినప్పటికీ ఒకసారి వివాదం జరిగింది. దీంతో షూటింట్ సెట్ నుంచి ఆమె వెళ్లిపోయింది. ఓ సాంగ్ పెండింగ్ ఉందని పిలిచిన రాలేదు. అంతే కాకుండా వేరే వాళ్లతో బిజీగా ఉన్నా అని చెప్పించింది. చివరకు ఆ సాంగ్ షూట్ చెయ్యకుండానే మూవీ రిలీజ్ చెయ్యా్ల్సి వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా.. మారుతి ప్రజెంట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘ది రాజా సాబ్’ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story