Kumari Selja : సీఎంను అలా ఎంపిక చేస్తే పార్టీలో చీలికలు.. కుమారి సెల్జా కీలక వ్యాఖ్యలు

by Hajipasha |
Kumari Selja : సీఎంను అలా ఎంపిక చేస్తే పార్టీలో చీలికలు.. కుమారి సెల్జా కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో : హర్యానా సీఎం సీటు రేసులో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఎంపీ కుమారి సెల్జా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కచ్చితంగా సీఎం రేసులో ఉన్నానని ఆమె స్పష్టం చేశారు. అయితే ఆ విషయాన్ని చాటి చెప్పేందుకు సంప్రదాయ రాజకీయ పోకడలను అనుసరించబోనని తేల్చి చెప్పారు. హైకమాండ్ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని కుమారి సెల్జా పేర్కొన్నారు. ఆదివారం ప్రముఖ మీడియా సంస్థకు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు.

‘‘వర్గ విభేదాలు అన్ని పార్టీలు, అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. కేవలం కాంగ్రెస్ పార్టీ లేదా హర్యానాపైనే వేలెెత్తి చూపడం ఎందుకు ? హర్యానా ఎన్నికల వేళ మేమంతా విభేదాలను పక్కన పెట్టి కలిసిమెలిసి పనిచేశాం’’ అని కుమారి సెల్జా చెప్పుకొచ్చారు. ‘‘ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న నేతనే సీఎంగా ఎంపిక చేసే పద్ధతి సరైంది కాదు. దానివల్ల పార్టీలో చీలికలు ఏర్పడుతాయి. సీఎంగా ఎవరు ఉండాలనే దానిపై హైకమాండే నిర్ణయం తీసుకోవాలి’’ అని ఆమె అభిప్రాయపడ్డారు. ‘‘ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దళితులు సహా అన్ని వర్గాల మద్దతు లభించింది. అందుకే భారీ విజయం దక్కబోతోంది. తప్పకుండా నాకు కూడా ప్రభుత్వంలో సముచిత స్థానాన్ని కేటాయిస్తారని ఆశిస్తున్నాను’’ అని సెల్జా పేర్కొన్నారు. కాగా, కుమారి సెల్జా దళిత వర్గం నాయకురాలు.

Advertisement

Next Story

Most Viewed