చెన్నై ఎయిర్ షో: రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట జరిగి ముగ్గురు మృతి

by Mahesh |   ( Updated:2024-10-06 14:24:53.0  )
చెన్నై ఎయిర్ షో: రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట జరిగి ముగ్గురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులోని చెన్నైలోని మెరీనా బీచ్‌లో భారత వైమానిక దళం నిర్వహిస్తున్న (Indian Air Force) మెగా ఎయిర్ షో లో తీవ్ర విషాదం నెలకొంది. 92వ ఎయిర్ ఫోర్స్ డే ఏర్పాట్లలో భాగంగా ఈ ఎయిర్ షో నిర్వహిస్తున్నట్లు ముందస్తుగా ప్రకటించడంతో లక్షల మంది ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ఎయిర్ షో మగిసిన అనంతరం లోకల్‌ రైల్వేస్టేషన్‌లో రైలు కోసం ఒక్కసారిగా జనం ఎగబడ్డారు. దీంతో రైల్వేస్టేషన్‌లో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 100 మందికి గాయాలు కాగా, పదిమంది సొమ్మసిల్లి పడిపోయారు. అలాగే తీవ్రంగా గాయాలు కావడంతో ముగ్గురు మృతి మృతి చెందినట్లు తెలుస్తోంది. చెన్నై తొక్కిసలాటలో మృతి చెందిన వారిలో ఏపీకి చెందిన వారు ఉన్నట్లు సమాచారం అందుతుంది. కాగా ఈ ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. తొక్కిసలాటలో గాయాలైన వారికి చికిత్స అందించడానికి స్థానిక ఆస్పత్రులకు తరలించారు. కాగా ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed