దేదినేనిపల్లి కిష్ట చెరువుకు గండి

by Naveena |
దేదినేనిపల్లి కిష్ట చెరువుకు గండి
X

దిశ, కొల్లాపూర్ (పెద్దకొత్తపల్లి): పెద్ద కొత్తపల్లి మండలం దేదినేనిపల్లి కిష్ట చెరువు కు వాగు సమీపంలో గండి పడింది. ఎగువన కురిసిన భారీ వర్షాలకు వరద ప్రవాహంతో..చెరువు నిండి గండి పడింది. ఆదివారం ఈ విషయాన్ని తెలుసుకున్న మైసమ్మ దేవాలయ చైర్మన్ బుడుగు శ్రీనివాసులు,మండల పరిషత్ మాజీ కో అప్షన్ సభ్యుడు ఎం డి సలీమ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెరువును పరిశీలించారు. సంబంధిత అధికారులు,ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలనీ వారు కోరారు.

Advertisement

Next Story