సీఎం రేవంత్ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్వీ అధ్యక్షుడు డిమాండ్

by Mahesh |
సీఎం రేవంత్ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్వీ అధ్యక్షుడు డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం రేవంత్ రెడ్డి వెంటనే విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు గంజాయి తాగుతున్నారని సీఎం వ్యాఖ్యలు చేశారని, ఆధారాలు ఏమైనా ఉంటే బయట పెట్టాలన్నారు. తెలంగాణ భవన్ లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక విద్యా వ్యవస్థ గాడి తప్పిందని మండిపడ్డారు. ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో ప్రైవేటు కళాశాలలో చదువుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యా శాఖ మంత్రి లేకపోవడంతో ఒక్క రివ్యూ లేదన్నారు. విద్యా కమిషన్ ఏర్పాటు అయినా ఇప్పటి వరకు పత్తా లేదని మండిపడ్డారు. మహిళా కమిషన్ కు ఉన్న సోయి విద్యా కమిషన్ కు లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి నెలకొందన్నారు. నాన్ టీచింగ్ స్టాఫ్ కు జీతాలు ఇవ్వడం లేదని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. బాసర ఐఐఐటీని సందర్శించాలని సీఎంకు సూచించారు. కేసీఆర్ తీసుకువచ్చిన ఓవర్సీస్ స్కాలర్షిప్ ను వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని కోరారు.

Advertisement

Next Story