- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Caste Census : త్వరలోనే కర్ణాటక క్యాబినెట్ ఎదుటకు కులగణన నివేదిక
by Hajipasha |
X
దిశ, నేషనల్ బ్యూరో : కుల గణన నివేదికపై కర్ణాటక ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దీనిపై త్వరలోనే రాష్ట్ర మంత్రిమండలిలో చర్చిస్తామని వెల్లడించింది. కుల గణన నివేదికను రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టాలా లేదా నేరుగా ప్రజలకు విడుదల చేయాలా అనే దానిపై మంత్రిమండలి చర్చించనుంది. ఈవివరాలను రాష్ట్ర హోంశాఖ మంత్రి జి.పరమేశ్వర ఆదివారం మీడియాకు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ బీసీ కమిషన్ ఈ ఏడాది ఫిబ్రవరి 29న కులగణన నివేదికను సీఎం సిద్ధరామయ్యకు సమర్పించింది.
ఆ నివేదికపై పలు బీసీ వర్గాలతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కర్ణాటకలోని అత్యంత కీలకమైన వొక్కలిగ, లింగాయత్ వర్గాలకు చెందిన నేతలు ఈ నివేదిక అశాస్త్రీయమైందని పేర్కొన్నారు. కులగణన సర్వేను మరోసారి పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
Advertisement
Next Story