తెరుచుకున్న కునో నేషనల్ పార్క్.. అయితే చీతాల కోసం నిరీక్షించాల్సిందే!

by Jakkula Mamatha |
తెరుచుకున్న కునో నేషనల్ పార్క్.. అయితే చీతాల కోసం నిరీక్షించాల్సిందే!
X

దిశ,వెబ్‌డెస్క్:మధ్యప్రదేశ్‌లో ఉన్న కునో నేషనల్ పార్క్ గ్వాలియర్ నుంచి 165 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పార్కులో శాకాహార జంతువులు(Herbivorous animals) ఎక్కువ. దీనికితోడు గడ్డి మైదానాలు ఉండటంతో చీతాలను వదలడానికి కునో నేషనల్ పార్క్‌ను(Kuno National Park) ఎంచుకున్నారు. ఈ కునో జాతీయ పార్కులో జింకలు(Deer), దుప్పులు, మనుబోతులు(wild boar), అడవి పందులు, చింకారాలు(chinkaras) పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఇక్కడ శాకాహార జంతువులు భారీగా ఉండటంతో చీతాలకు ఆహార సమస్య ఉండదు. ఈ పార్కులో చీతాలకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఇక్కడి సగటు ఉష్ణోగ్రతలు 42.3 డిగ్రీల సెల్సియస్. శీతాకాలంలో 6 నుంచి 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.

అయితే చిరుతలకు నిలయమైన మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కు(Kuno National Park) తిరిగి తెరుచుకుంది. వర్షాల కారణంగా ఇటీవల సందర్శకుల పర్యటనను నిషేధించారు. ఈ క్రమంలో చిరుతలను ఇంకా అడవుల్లోకి వదలకపోవడంతో వాటిని చూసేందుకు మరిన్ని రోజులు నిరీక్షించాల్సిందే అంటున్నారు. చిరుతలు అంతరించిపోతున్న పరిస్థితుల్లో 2022లో కేంద్రం నమీబియా నుంచి 8, దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలను తీసుకొచ్చింది. అప్పటి నుంచి వాటిని ఎన్‌క్లోజర్‌లో ఉంచి సంఖ్య పెంపునకు చర్యలు తీసుకుంటోంది.

Advertisement

Next Story

Most Viewed