'రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి'.. ఐటీడీఏ కార్యాలయం ముందు ధర్నా

by Vinod kumar |
రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి.. ఐటీడీఏ కార్యాలయం ముందు ధర్నా
X

దిశ, భద్రాచలం: చర్ల మండలం పూసుగుప్ప గ్రామం లో వేస్తున్న రోడ్డు నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని, రోడ్డు వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న కాంట్రాక్టర్ రాంబాబు పై చర్యలు తీసుకోవాలని.. సోమవారం పూసుగుప్ప గ్రామస్తులతో కలిసి సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో భద్రాచలం ఐటీడీఏ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ పీవో కు వినతిపత్రం అందజేశారు.

తునికాకు బోనస్, పెండింగ్‌లో ఉన్న పోడు పట్టాలు ఇవ్వాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు రేపాకుల శ్రీనివాస్, మండల కార్యదర్శి కారం నరేష్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు పనులపై అధికారుల పర్యవేక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. సీపీఎం మండల కమిటీ సభ్యులు దొడ్డి హరినాగవర్మ మాట్లాడుతూ ఆదివాసులను మోసం చేయాలని చూస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నలభై ఆరు మంది ఆదివాసులకు పోడు పట్టాలు ఇవ్వలేదని వెంటనే ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, ధర్మయ్య, ప్రదీప్, రామక్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story