కరీంనగర్ పర్యటన రద్దు చేసుకొని హుటాహుటిన ఖమ్మం బయలుదేరొచ్చిన డిప్యూటీ CM

by Anjali |   ( Updated:2024-09-01 02:35:16.0  )
కరీంనగర్ పర్యటన రద్దు చేసుకొని హుటాహుటిన ఖమ్మం బయలుదేరొచ్చిన డిప్యూటీ CM
X

దిశ మధిర: ఖమ్మం, మధిర లో భారీ వర్షాల నేపథ్యంలో.. ఒక్కసారి గా వాగులు వంకలు నదులు పొంగిపొర్లయీ.. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సమాచారం తెలుసుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కరీంనగర్, చెన్నూరు పర్యటన అర్ధాంతరంగా రద్దు చేసుకొని హుటాహుటిన నేరుగా శనివారం రాత్రి ఖమ్మం చేరుకున్నారు. మార్గమధ్యలో ఖమ్మం కలెక్టర్ , ఖమ్మం కార్పొరేషన్, మధిర రెవిన్యూ, మునిసిపల్ అధికారులతో పరిస్థితిని సమీక్షించి వారికి పలు సూచనలు చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అధికారులు అలెర్ట్ గా ఉండాలని ఆదేశించారు. వాగులు, వంకలు , నదులు పొంగుతున్న నేపథ్యంలో ప్రజలకు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలను క్యాంపులకు తరలించాలని.. అక్కడ వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఖమ్మం నుండి శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆదివారం తెల్లవారు జాముకు మధిర కు చేరుకున్నారు. మండల పరిధిలోని వంగవీడు గ్రామానికి చెందిన మత్స్యకార సభ్యుడు అయినా తోటపల్లి వెంకటేశ్వర్లు వలను తొలగించేందుకు బుగ్గ వాగులో దిగి చిక్కుకున్నాడు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వద్దకు చేరుకొని వెంకటేశ్వర్లు ను బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు దగ్గరుండి పర్యవేక్షించారు. ఎట్టకేలకు వెంకటేశ్వర్లు రక్షించారు. వైరా నదిలో భారీగా నీరు ప్రవహించడంతో మధిర పట్టణంలోని ఐ పి డి ఎస్ సబ్ స్టేషన్ నదికి ఆనుకుని దగ్గరగా ఉండటంతో వరద నీరు సబ్ స్టేషన్ లోకి ప్రవేశించడంతో అందులోనే రెండు ట్రాన్స్ఫార్మర్ లు కొంతమేర నీటిలో మునిగాయి. సబ్ స్టేషన్ పరిధిలోనే ఉన్న 11 ఫీడర్ లకు అంతరాయం వాటిల్లింది.

ఇందులో రెండు ఫీడర్లు గ్రామీణ ప్రాంతానికి చెందిన గా ఉన్నాయి. పట్టణ ప్లీడర్లకు ప్రత్యామ్నాయ ఫీడర్ ద్వారా విద్యుత్తును పునరుద్దించారు. మధిర ఎరుపాలెం బోనకల్లు మండలాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడినప్పటికీ విద్యుత్ శాఖ సిబ్బంది వర్షాన్ని భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అన్ని గ్రామాలకు యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సరఫరా చేయుటకు సాయి శక్తుల శ్రమిస్తున్నారు అని ఖమ్మం ఎస్సీ సురేందర్ ఉప ముఖ్యమంత్రి తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను మధిర 100 పడకల ఆసుపత్రిలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేయగా ఆ కేంద్రాన్ని చేరుకొని వారితో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. డిప్యూటీ సీఎం వెంట ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అధికారులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed