- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
శ్రీ రామచంద్ర ఆర్ట్స్ కాలేజీ ఆస్తులకు చెదలు!
దిశ, కొత్తగూడెం రూరల్: ఎంతో చరిత్ర కలిగిన ఈ కాలేజ్ అభివృద్ధి గురించి పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ఇక్కడ చదివిన విద్యార్థిని విద్యార్థులు ఉన్నంత స్థాయిలో ఉన్నారు. అలాంటి కళాశాల నేడు అనేక సమస్యలతో సతమతమవుతుంది. విద్యాలయ ఆస్తులకు సైతం చెదలు పట్టి దర్శనమివ్వడం కలవర పెడుతున్న పరిస్థితి నెలకొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలో ఉన్న శ్రీ రామచంద్ర ఆర్ట్స్ సైన్స్ కాలేజ్ సమస్యలకు నిలయంగా నిలుస్తోంది. 1964 సంవత్సరంలో కాలేజీ ప్రారంభం కావడం జరిగింది. అప్పటినుండి ఇప్పటివరకు అనేకమంది విద్యార్థిని విద్యార్థులు చదువుల్లో రాణించి ఉన్నత స్థాయిలో నిలవడమే కాకుండా అనేక బహుమతులు గెలుచుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ కళాశాలలో బీకాం కంప్యూటర్ బీఎ బీఎస్సీ ఫిజికల్ అండ్ లైఫ్ కోర్సులు నడుస్తున్నాయి.
ప్రస్తుతం ఈ కాలేజీలో సుమారు 350 మంది విద్యార్థిని విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే పాత బిల్డింగులు కాలం చెల్లడంతో దీనికి ఆల్టర్నేట్ గా 2017 సంవత్సరంలో అదనపు గదులు నిర్మించి విద్యను బోధించడం జరుగుతుంది. కాలేజీ పాత భవనాలు శిథిలావస్థలో ఉండగా నేటి వరకు వాటిని కూల్చివేయకుండా వదిలేయడం వల్ల ఫర్నిచర్ ఇతర సామాగ్రికి చెదలు పడుతున్న దుస్థితి నెలకొంది. శిథిలావస్థలో ఉన్న భవనాలకు సంబంధించిన పాత ఫర్నిచర్ ను తొలగించి వాటికి వేలంపాట నిర్వహిస్తే వచ్చిన నిధులతో కాలేజీ అభివృద్ధికి ఖర్చు పెట్టే అవకాశం ఉన్నా కూడా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. పాత భవనాల చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి ఉండడం వల్ల విష సర్పాలు సంచరిస్తున్నాయి. దీంతో విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కాలేజీ భూమి కొంత గతంలో ఆక్రమణకు గురైన విషయం తెలిసిందే. రామచంద్ర ఆస్తులు చెదిరిపోకుండా కరిగిపోకుండా ఉండాలంటే సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని కాలేజీ అభివృద్ధికి నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
కాలేజ్ అభివృద్ధికి ప్రతిపాదనలు పంపిస్తాం..
శ్రీ రామచంద్ర ఆర్ట్స్ సైన్స్ కాలేజ్ అభివృద్ధికి ప్రతిపాదనలు పంపించడానికి సిద్ధమవుతున్నామని కొంతమంది లెక్చరర్లు తెలిపారు. పాత భవనాలను తొలగించాలని ఇటీవల అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని పేర్కొన్నారు. నిధులు మంజూరు అయితే పాత భవనాలను కూల్చివేసి కాలేజీకి మళ్లీ పూర్తిస్థాయిలో పూర్వవైవం తీసుకువచ్చే విధంగా తమ వంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు.