వీరయ్యకి పట్టం కట్టండి

by Sridhar Babu |   ( Updated:2023-11-21 14:03:01.0  )
వీరయ్యకి పట్టం కట్టండి
X

దిశ, చర్ల : నిజాయితీపరుడైన పొదెం వీరయ్యకి ఓట్లువేసి మరోమారు గెలిపించాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య విజయాన్ని కోరుతూ మంగళవారం చర్ల బస్టాండ్ సెంటర్‌లో జెడ్పీటీసీ ఇర్పా శాంత అధ్యక్షతన జరిగిన కార్నర్ మీటింగ్‌లో వారు ప్రసంగించారు. ఈ నెల 30న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇవ్వడానికి సిద్ధమైనారని తెలిపారు.

వరుసగా రెండుసార్లు అధికారం అప్పగిస్తే సీఎం కేసీఆర్​ తెలంగాణ ప్రజల బాగోగులు పట్టించుకోకుండా తన కుటుంబ శ్రేయస్సు కోసమే పనిచేసి లక్షల కోట్ల రూపాయలు కూడ పెట్టుకున్నారని ఆరోపించారు. ఈ అవినీతి ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ప్రజలు సిద్ధమైనారని అన్నారు. భద్రాచలం ఎమ్మెల్యేగా గెలిచిన పొదెం వీరయ్యని బీఆర్ఎస్‌‌లో చేర్చుకోవడానికి సీఎం కేసీఆర్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్నారు. నిజాయితీపరుడైన వీరయ్య ప్రజలు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి పార్టీ మారకుండా కాంగ్రెస్‌‌లోనే కొనసాగుతున్నారని అన్నారు. ఇదే జిల్లాలో అనేకమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్‌‌లో చేరినా పొదెం వీరయ్య మాత్రం పార్టీ మారలేదని, ఇలాంటి నిబద్ధత కలిగిన నాయకుడికి ఓట్లు

వేసి మరో మారు గెలిపించాలని కోరారు. నిజంగా భద్రాచలాన్ని అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే నిధులు మంజూరు చేసేదన్నారు. తెలంగాణ ప్రజలు ఇచ్చే సంచలన తీర్పుతో డిసెంబర్ 9న తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడబోతోందన్నారు. అప్పుడు సోనియమ్మ ప్రకటించిన ఆరు గ్యారంటీలు, కాంగ్రెస్ మేనిఫెస్టో అమలుతోపాటు భద్రాచలం ప్రాంత అభివృద్ధి బాధ్యత తాము కూడా తీసుకుంటామని హామీ ఇచ్చారు. తను మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఎన్నిసార్లు వచ్చి ఎంత అభివృద్ధి చేశానో, ఇపుడున్న మంత్రి ఎన్నిసార్లు వచ్చారో భేరీజు వేసుకోవాలని తుమ్మల కోరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ

సభ్యులు నల్లపు దుర్గాప్రసాద్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆవుల విజయభాస్కర్‌రెడ్డి, నాయకులు పరుచూరి రవికుమార్, చీమలమర్రి మురళీకృష్ణ, జవ్వాది రవికుమార్, బండారు రామకృష్ణ, ఇందల బుచ్చిబాబు, చీమకుర్తి వీరభద్రం, తోటమల్ల వరప్రసాద్, బండి వేణు, గుండెపూడి సతీష్, మడకం పద్మజ, టీడీపీ నాయకులు కొడాలి శ్రీనివాస్, కొత్తపల్లి రామాంజనేయులు, ఎడారి సత్యనారాయణ, నల్లూరి మురళి, సీపీఐ నాయకులు రావులపల్లి రవికుమార్, కల్లూరి వెంకటేశ్వరరావు, అడ్డగర్ల తాతాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్నర్ మీటింగ్‌కి వేలాదిగా జనం తరలివచ్చారు. అంతకు ముందు పరుచూరి సూర్యప్రకాశరావు స్వగృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో పొంగులేటి, తుమ్మల పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed