నష్టపరిహారం చెల్లించాలని ధర్నా

by S Gopi |
నష్టపరిహారం చెల్లించాలని ధర్నా
X

దిశ, గుండాల: అకాల వర్షంతో నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం ఆదుకుని నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ సీపీఎంఎల్ న్యూ డెమోక్రసీ అఖిలభారత రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో గురువారం గుండాల మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి తహశీల్దార్ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. ధర్నాను ఉద్దేశించి సీపీఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు గుండాల ఎంపీపీ ముక్తి సత్యం మాట్లాడుతూ అకాల వర్షం వల్ల గుండాల మండలంలో మొక్కజొన్న, వరి, మిర్చి, పొద్దు తిరుగుడు పంటలు నేలరాలి చేతికి అందిన పంట నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం సర్వే నిర్వహించి రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పంట నష్టం వాటిల్లిన రైతుకు ఎకరాకు ప్రభుత్వం రూ. 20,000 చెల్లించాలని కోరారు. ప్రభుత్వం పంటలు భీమా సౌకర్యం ఏర్పాటు చేయాలని ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకుని రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు.

ఉండాల సర్పంచ్ కోరం సీతారాములు మాట్లాడుతూ అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుని వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కోరారు. అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు కందకట్ల సురేందర్, నరేష్, తదితరులు ప్రసంగించారు. ఈ ర్యాలీ గుండాల పురవీధులు గుండా కొనసాగింది. ర్యాలీలో న్యూ డెమోక్రసీ నాయకులు రవి, వెంకన్న, మీసం కృష్ణ, లాలయ్య, లాలు, ఓకే బాబు, మంగయ్య, నరసింహారావు, వెంకన్న, పెండేకట్ల పెంటయ్య, రాంబాబు, ఓకే వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story