'కార్పొరేట్ శక్తులకి వ్యతిరేకంగా పోరాడుదాం'

by Vinod kumar |
కార్పొరేట్ శక్తులకి వ్యతిరేకంగా పోరాడుదాం
X

దిశ, కూసుమంచి: 'కార్పొరేట్ శక్తులకి వ్యతిరేకంగా పోరాడుదాం' అని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు కే గోవర్ధన్ పిలుపునిచ్చారు. ఖమ్మం పాలేరు లో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలో అనేక మార్పులు వస్తున్నాయని.. ముఖ్యంగా అమెరికా సామ్రాజ్యవాద శక్తి రోజు రోజుకు తగ్గుతుందని అయినప్పటికీ ప్రపంచంలో, అనేక దేశాలు అమెరికాతో పోటీ పడుతున్నాయని అన్నారు. 2014 సంవత్సరం నుండి దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి చరవేగంగా ప్రజలు అనేక సంవత్సరాలు కష్టపడి సాధించిన ప్రజల సంపదను కారు చౌకగా అమ్ముతున్నారని, 2014 నుండి 2022 వరకు నాలుగు లక్షల కోట్ల రూపాయల ప్రజల ఆస్తులను తమకు దగ్గరగా ఉన్న కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం ముఖ్యంగా ఆదాని కంపెనీకి విమానాశ్రయం ఎయిర్ పోర్టులు సముద్ర మార్గం అమ్ముతున్నాడని, లాభాల్లో నడుస్తున్న ఎల్ఐసీని చివరికి రైల్వే లైనులు, అమ్ముతున్నారని ఆయన విమర్శించారు.


దేశంలో హిందూ బ్రాహ్మణిజం ప్రజలపై పెద్ద ఎత్తున దాడులు చేయాలని చర్యలు ముందుకు వస్తున్నాయని, మతం పేరుతో అనేక రాష్ట్రాలలో హిందూ సంస్థలు దళితులపైన ముస్లింల పైన దాడులు చేస్తున్నాయని మహిళల పైన అత్యాచారాలు హత్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం మాటలే ఎక్కువ చేతల్లో తక్కువ లాగా ఫోజులు ఇస్తూ రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయలను అప్పులు చేశాడని ప్రతి మనిషికి రెండు లక్షల రూపాయలు అప్పు ఉన్నాయన్నారు.

ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను దళిత మూడెకరాల భూమి లేదు, అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ లేవు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ఏ రంగం కూడా బాగుపడ్డలేదన్నాడు. మరొకసారి ప్రజల్ని మోసం చేయడానికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడగబోతుందని ఇలాంటి ప్రభుత్వాలను ప్రజలు సంఘటితంగా ఉద్యమించి తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ సబ్ డివిజన్ నాయకులు ఎం గిరి. టీపీటీఎఫ్ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు సి బాబురావు సారు, పూర్ణచంద్రరావు, ప్రగశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ ఖమ్మం జిల్లా నాయకురాలు కే కల్పన, ప్రగత శీల యువజన సంఘం పీవైఎల్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి నలగాటి వీరేందర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story