పాలేరు కాంగ్రెస్ టికెట్ రాయలకి ఇవ్వాలి : జెర్రిపోతుల అంజని

by Sumithra |   ( Updated:2023-09-06 14:46:38.0  )
పాలేరు కాంగ్రెస్ టికెట్ రాయలకి ఇవ్వాలి : జెర్రిపోతుల అంజని
X

దిశ, నేలకొండపల్లి : మండల కేంద్రంలోని శ్రీ సీతారామఫంక్షన్ లో బుధవారం పాలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజనీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరవై సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఎంతో మందికి టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు సహాయం అందించారన్నారు. తొమ్మిది సంవత్సరాల పాటు పాలేరులో కాంగ్రెస్ పార్టీని నడిపించిన టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావుకి పాలేరు టిక్కెట్ ఇవ్వాలన్నారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా వెన్నంటి ఉన్ననాయకుడు రాయల నాగేశ్వరరావని, పాలేరు నియోజకవర్గంలో ప్రతి గ్రామం తిరిగి పార్టీ బలోపేతానికి కృషి చేశారన్నారు.

కాంగ్రెస్ కార్యకర్తలు కష్టకాలంలో ఉన్నసమయంలో నేనున్నానంటూ భరోసా ఇచ్చారని ఆయన అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్సీగా పోటీ చేసి పార్టీకి ఉన్న ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు సాధించిన నాయకుడన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని పాలేరు నియోజకవర్గంలో ముందుండి నడిపించిన కాంగ్రెస్ జాతీయ నాయకులు భారత్ జోడో యాత్రతో పాల్గొనడంతో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రను జిల్లాల్లో ముందుండి నడిపించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని పటిష్టపరిచేందుకు విస్తృత ప్రచారం చేసారని ఇప్పటికైనా ఆయన కష్టాన్ని గుర్తించి పాలేరు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ రాయల నాగేశ్వరరావుకి ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు యడవల్లి నాగరాజు, పగిడికత్తుల సుదర్శన్, మద్ది రాజారెడ్డి, పల్లెబోయిన శ్రీనివాస్, మార్తి కోటి, పగిడిమర్రి అజయ్, భానోతు నరేష్, సంపేట ప్రశాంత్, జంగా బాలక్రిష్ణ, పెద్దపాక ముత్తయ్య, గట్టిగుండ్ల విజయ్, దనవత్ సంతోష్, కుమ్మరి వీరబాబు, హరి, బాలాజీ, కాసాని వెంకటేష్, అనంతు నాగేంద్ర బాబు, సునీల్, రంజిత్, వడ్డె సుదీర్, మధు, మేకపోతుల సురేష్, అనంతు మనోజ్, తోట వాసు, తాత దిలీప్, కోడిరెక్కల శ్రీకాంత్, పగిళ్ల సాయి, పల్లపు రంగ, కిన్నెర రమేష్, రాంబాబు, వెంకటేష్, కోడిరెక్కల వినోద్, కుక్కల శ్రీను, ఉపేందర్, నవిలీ వీరబాబు, పరిమి వీరబాబు, జానీ, శ్రీను, గట్టిగుండ్ల నాగరాజు, మాదారపు హేమంత్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story